హోమ్ /వార్తలు /తెలంగాణ /

వాతలు పెట్టుకోకుండానే పులిలా కనిపిస్తున్న అరుదైన కుక్క.. కొత్తవాళ్లెవరైనా వస్తే అంతే...

వాతలు పెట్టుకోకుండానే పులిలా కనిపిస్తున్న అరుదైన కుక్క.. కొత్తవాళ్లెవరైనా వస్తే అంతే...

పులిలా కనిపించే కుక్క

పులిలా కనిపించే కుక్క

Dogs Looks As Tiger: ఈ పులిని పోలిన కుక్కను చూసి ఇతర జంతువులు కూడా పారిపోతున్నాయి. గ్రామస్తులు కొత్తలో కొంత భయపడినా, ఊరికి కొత్తగా వచ్చేవారు మాత్రం ఈ పులిరంగును పోలిన కుక్కను చూసి హడలెత్తిపోతున్నారు.

  • News18
  • Last Updated :

పూర్వ కాలంలో పులిలాగ కనిపించాలని ఓ నక్క వాతలు పెట్టుకుంటదట. అది నిజమో కాదోగాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అన్న జాతీయం మాత్రం వాడుకులోకి వచ్చింది. ఆ మాట పక్కన బెడితే ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో మాత్రం అచ్చం పులిని పోలిన కుక్క అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా కుక్కలు తెలుపు, నలుపు లేదంటే గోధుమ రంగులో ఉంటాయి. తెల్లటి మచ్చలతో కూడిన నల్లటి కుక్కలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. కాని పులి మాదిరిగా ఒంటిపై చారలు, అదే రంగు కలిగి ఉండడం అరుదు. అలాంటిదే ఓ కుక్క ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఉంది. దూరం నుండి చేస్తే అది పులి అని భ్రమపడుతున్నారు, భయపడుతున్నారు. దగ్గరికి వచ్చి చూస్తే అది కుక్కే కానీ ఒంటిమీద మాత్రం పులిలాగా చారలు ఉన్నాయి.


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని మెస్రం జంగుబాపు అనే వ్యక్తి చిన్నప్పటి నుండి ఈ కుక్కను పెంచుకుంటున్నాడు. పుట్టుక నుండి ఈ కుక్క పులిని పోలిన రంగు, ఒంటిపై చారలతో ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గ్రామస్థులు దీన్ని చూసి ఇది కుక్కే కదా అని కొంత నిలకడగా ఉంటున్నా, ఊరికి కొత్తగా వచ్చేవారు మాత్రం ఈ కుక్కను దూరం నుండి చూసి అమ్మో పులి అని భయపడుతున్నారు. గ్రామంలో అంతా ఈ కుక్కను పులినిపోలిన కుక్క అని పిలుస్తూ సందడి చేస్తున్నారు. అటవి జంతువుల నుండి రక్షణ కోసం యజమాని గాని, వారి కుటుంబ సభ్యుల కాని పొలాలకు వెళ్తే ఈ కుక్కను తమ వెంట తీసుకెళుతున్నారు.

ఈ పులిని పోలిన కుక్కను చూసి ఇతర జంతువులు కూడా పారిపోతున్నాయి. గ్రామస్తులు కొత్తలో కొంత భయపడినా, ఊరికి కొత్తగా వచ్చేవారు మాత్రం ఈ పులిరంగును పోలిన కుక్కను చూసి హడలెత్తిపోతున్నారు. పులి లాంటి కుక్కను చూసి కుక్కనా..? పులా...? అంటూ అశ్చర్యపోతున్నారు. అయితే ఇలాంటి కుక్కలు అరుదుగా ఉంటాయని, ఇది జన్యుపరమైన లక్షణమని ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి వి. సురేష్ పేర్కొన్నారు. సాధారణ కుక్కలకు మచ్చల కుక్కలు లేదా డాల్మిషన్, జర్మన్ షఫర్డ్ జాతి కుక్కలతో క్రాసింగ్ జరిగినప్పుడు ఇలాంటి కుక్కలు పుడతాయని ఆయన వివరించారు.

First published:

Tags: Adilabad, Dog, Telangana, Tiger, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు