Home /News /telangana /

DOCTORS HAVE IDENTIFIED SYMPTOMS OF MONKEYPOX IN A PERSON IN TELANGANA WHO CAME FROM KUWAIT PRV

Monkeypox: తెలంగాణలోకి మంకీపాక్స్​..? ఫీవర్​ ఆస్పత్రికి బాధితుడు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ప్రమాదకరమైన మంకీ పాక్స్​ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ (Medical Health Department) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో  కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ లక్షణాలు కలకలం రేపుతున్నాయి

    ప్రపంచ దేశాల్ని భయపెడుతున్న మంకీ పాక్స్ ప్రభావం తెలంగాణ(Telangana)పై కూడా చూపుతోంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం( National Center for Disease Control)నుంచి వచ్చిన సంకేతాలు, సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ (Monkeypox)కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఒంటిపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఉన్న వారిని గుర్తించాలని అధికారులను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ (Medical Health Department) ఆదేశించింది. ఈ నేపథ్యంలో  కామారెడ్డి  (Kamareddy) జిల్లాలో మంకీ పాక్స్ లక్షణాలు కలకలం రేపుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 సంవత్సరాల ఓ వ్యక్తి మంకీ పాక్స్ లక్షణాలతో (Monkeypox Symptoms) బాధపడుతూ జిల్లా ఆస్పత్రికి వెళ్ళాడు.

    పరీక్షించిన వైద్యులు అతడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి (Fever Hospital) తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సదరు వ్యక్తి ఈ నెల 6న కువైట్ (Kuwait) నుంచి వచ్చాడని, ఈ నెల 20 నుంచి జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. 23న మంకీప్యాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతను వైద్యులను సంప్రదించగా.. వైద్యులు మంకీ పాక్స్గా అనుమానిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టుగా సమాచారం.



    లక్షణాలు ఇలా..

    ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. మంకీపాక్స్‌లో ప్రధానంగా రెండు జాతులు(స్ట్రెయిన్స్‌) ఉన్నాయి. ఒకటి కాంగో స్ట్రెయిన్. ఇది కొంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్ట్రెయిన్ సోకితే దాదాపు 10 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. మరో స్ట్రెయిన్‌ పశ్చిమ ఆఫ్రికా.. దీని మరణాల రేటు కేవలం 1 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుతం UK లో నమోదు అవుతున్న కేసుల్లో పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్‌ ఉన్నట్లు గుర్తించారు.

    ఇలా సోకుతుంది: వైరస్ సోకిన జంతువు కరిచినా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి రక్తం, చెమటను తాకినా ఇది సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన జంతువు మాంసం సరిగా ఉడికించ‌కుండా తిన్నా ఈ వ్యాధి ప్రబలుతుంది. ఉడతలు, ఎలుకల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.

    ఎలా వ్యాప్తి చెందుతుంది..?

    ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కువగా యువకులకు సోకుతోంది. ఆఫ్రికాతో సంబంధం లేని ఓ యువకుడికి ఈ వైరస్ సోకింది. అతను స్వలింగ సంపర్కుడు అని, ఈ నేపథ్యంలో ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరి సోకుతుందన్న అనుమానాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తం చేసింది. ఆ యువకుడు ఇటీవల మరో పురుషుడితో శృంగారం చేశాడని వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్‌లో కూడా యువకుల్లోనే ఈ వ్యాధి సోకింది. వారు కూడా ఇతర మగాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నారని ఆ దేశాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో శృంగారం ద్వారా ఈ వ్యాధి సోకుతుందన్న అనుమానాలకు ఇది బలం చేకూర్చినట్లయింది. మరోపక్క స్వలింగ సంపర్కం వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Kamareddy, Kuwait, Monkeypox

    తదుపరి వార్తలు