హోమ్ /వార్తలు /తెలంగాణ /

Government Hospital: ప్రభుత్వాసుపత్రి అరుదైన ఘనత.. తొలిసారిగా మోకాలు చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స

Government Hospital: ప్రభుత్వాసుపత్రి అరుదైన ఘనత.. తొలిసారిగా మోకాలు చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స

ఆస్పత్రి వైద్యులు, కలెక్టర్​తో పేషెంట్​

ఆస్పత్రి వైద్యులు, కలెక్టర్​తో పేషెంట్​

కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే వైద్య సేవలను పేద ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా అందిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి రోగికి ఆనందాన్ని కలిగించారు.

ఇంకా చదవండి ...

ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పెద్ద పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్​ వైద్యశాలల వైపే అంతా చూస్తున్నారు. అదే అదునుగా భావించి కార్పోరేట్ ఆస్పత్రులు రోగుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే వైద్య సేవలను పేద ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా పలురకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స (completed a rare surgery)ను విజయవంతంగా పూర్తి చేసి రోగికి ఆనందాన్ని కలిగించారు. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి అరుదైన మోకాలు చిప్ప (knee replacement) మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

పూర్తిగా ఉచితం..

నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం రాయదారి గ్రామానికి చెందిన దేవా సింగ్ చాలా రోజుల నుండి మోకాలు నొప్పితో నడవలేని స్థితి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేవా సింగ్  (Deva singh)కు నిర్మల్ ప్రభుత్వ ఆసపత్రి వైద్య బృందం మోకాలు చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స (Knee replacement surgery) చేశారు. మొట్టమొదటి సారి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా చేశారు. ప్రస్తుతం దేవా సింగ్ నడువగలుగుతున్నారు. దీంతో శనివారం అతడిని ఆస్పత్రి నుండి డిచ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించి మొదటిసారిగా అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్యులను అభినందించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ  కాయకల్ప, లక్ష్య, తదితర   స్కీమ్ ల ద్వారా మెరుగైన  వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రి పై  నమ్మకం కలిగేలా  సేవలు  అందిస్తున్న వైద్య బృందాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరెండెంట్  దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఆపరేషన్ చేశామన్నారు. ఒకవేళ ఇదే ఆపరేషన్ బయట అయితే రెండున్నర లక్షల వరకు ఖర్చు అయ్యేదని ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా పేషెంట్ ను సంతోషంగా నడచేటట్టు చేసి ఇంటికి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ ప్రమోద్ చంద్ర, రఘునందన్ రెడ్డి అరుణ్ ,విజయ్, అనస్తియా నలిని, వేణు పాల్గొన్నారు.

First published:

Tags: Adilabad, Government hospital, Nirmal

ఉత్తమ కథలు