ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో గత కొన్ని గంటల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను(Kalvakuntla Kavitha) ఈడీ విచారిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం కార్యాలయంలోకి డాక్టర్ల బృందం కూడా వెళ్లంది. అందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. ఇక ఈడీ(ED Office) కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ చేరుకున్నారు. ఆయనతో పాటు న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ కూడా ఉన్నారు. కొన్ని గంటలుగా విచారణ ఎదుర్కొంటున్న కవితను అరెస్ట్ చేస్తారా ? లేక రెగ్యులర్‌గా ఆమెను కలిసేందుకు వీరంతా వచ్చారా ? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే అరెస్ట్ లాంటి పరిణామం ఏమీ లేదని ఆమెను కలిసి వచ్చిన వాళ్లు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు అరుణ్ పిళ్లైను కూడా అధికారులు విచారిస్తున్నారు. విచారణ ముగిశాక రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లైను ఈడీ హాజరుపరిచింది. ఆయనను కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించే అవకాశం ఉంది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా ఈడీ ఇప్పటికే పేర్కొంది. సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు వంటి అంశాలపై కవితను ఈడీ ప్రశ్నించింది.
హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు.. ఇదే కారణం.. !
KTR: అవన్నీ ప్రజలకు వివరించండి.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు.. పార్టీ ప్లీనరీపై క్లారిటీ
అంతకముందు కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె హాజరుకాలేదు. దీంతో ఆమెకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana