ప్రగతి భవన్‌‌లో చనిపోయిన హస్కీ... పోలీసుల కేసు

ఈ నెల 10న 11 నెలల హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆయన వైద్యమందించారు.

news18-telugu
Updated: September 14, 2019, 9:40 AM IST
ప్రగతి భవన్‌‌లో చనిపోయిన హస్కీ... పోలీసుల కేసు
జింక ఎముక తింటున్న కుక్క (Jesse Jordan/Twitter)
  • Share this:
సీఎం కేసీఆర్‌ నివాసం ప్రగతి భవన్‌లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల హస్కీ అనే కుక్క పిల్ల చనిపోయింది.దీంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌ గురువారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లో యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే డాక్టర్ ట్రీట్‌మెంట్‌ చేస్తుండగానే కుక్క మృతి చెందింది. దీంతో డాక్టర్ నిర్లక్ష్యంతోనే కుక్క మృతి చెందిందని ఆసిఫ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు నిర్లక్ష్యం వహించిన వెటర్నరీ వైద్యుడిపై కేసు నమోదు చేసుకున్నారు.

బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్‌ అలీఖాన్‌ ఐదేళ్లుగా ప్రగతి భవన్‌ డాగ్‌ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడున్న 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. ఈ నెల 10న 11 నెలల హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆయన వైద్యమందించారు. కుక్క కొద్దిగా కోలుకుంది. సాయంత్రం 6గంటలకు మళ్లీ కుక్క అనారోగ్యానికి గురై తిండి మానేసింది. ఈ నెల 11న ఉదయం 7గంటలకు పాలు కూడా తాగకుండా తీవ్ర అస్వస్ధతకు గురైంది.

వెంటనే ఆయన రెగ్యులర్‌ వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. మధ్యాహ్నం 2గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షలు చేశాడు. కుక్క 101 జ్వరంతో బాధపడుతుండడంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. దీంతో కుక్క పరిస్ధితి మరింత విషమించింది. రాత్రి 9గంటలకు రోడ్‌ నంబర్‌ 4లోని యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లి డాక్టర్‌ రంజిత్‌కు చూపించాడు. ఆయన ట్రీట్‌మెంట్‌ ఇస్తుండగానే కుక్క చనిపోయింది. దీంతో డాక్టర్‌ రంజిత్‌ నిర్లక్ష్యంతోనే కుక్క చనిపోయిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అలీఖాన్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...