హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ములుగు ఏజెన్సీతో సినీ గాయని సునీతకు ఉన్న బంధం ఏంటో తెలుసా?

Mulugu: ములుగు ఏజెన్సీతో సినీ గాయని సునీతకు ఉన్న బంధం ఏంటో తెలుసా?

సింగర్ సునీత

సింగర్ సునీత

Singer Sunitha: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రముఖ సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏజెన్సీకి సునీత వచ్చే అంత ముఖ్యమైన కార్యక్రమం ఏమిటి? ఆ కార్యక్రమానికి సినీ గాయనికి ఉన్న రిలేషన్ ఏమిటి?

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (Venu Medipelly,News18, Mulugu)

  ప్రముఖ సినీ గాయని సునీత (Singer Sunith) ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు వచ్చింది...? సినీ గాయని సునీత మెట్టినిల్లుఎంతమందికి తెలుసు. ఏజెన్సీ ప్రాంతంతో సినీగాయని సునీతకు ఉన్న రిలేషన్ ఏమిటి..? ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రముఖ సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు లాంటి ప్రాంతానికి సునీత వచ్చే అంత ముఖ్యమైన కార్యక్రమం ఏమిటి? ఆ కార్యక్రమానికి సినీ గాయనికి ఉన్న రిలేషన్ ఏమిటి?

  Visakhapatnam: వాళ్లు పులి కంటే చలికే ఎక్కువ భయపడుతున్నారు .. డేంజర్‌ లెవెల్‌కి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  సునీత రెండో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన భర్త డిజిటల్ మీడియా, వ్యాపార రంగంలో  ఎంతే పేరున్న  వ్యక్తి.   కోట్ల ఆస్తి ఆయను ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.   సునీత భర్త పేరు వీరపనేని రామకృష్ణ. ఈయన్ను చాలామంది మ్యాంగో రామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బయటి మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్​కి ఎంత పేరు ఉందో మ్యాంగో మ్యూజిక్​కి కూడా అంతే పేరు ఉంది. ఆ మ్యాంగో మ్యూజిక్ కంపెనీకి వీరపనేని రామ్ సీఈఓగా పనిచేశారు. ఒకసారి వీరపనేని రామకృష్ణ తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, శివాజీ.

  రామకృష్ణ ఆయన బాల్యం, చదువు హైదరాబాద్ , హనుమకొండ నగరాలలో జరిగింది. రామకృష్ణ అత్యంత ప్రతిభ గల వ్యక్తి . వ్యాపారంగం, డిజిటల్ మీడియా రంగంలోనూ అమితమైన అపార అనుభవం ఆయన సొంతం. ములుగు జిల్లా వాసిరామకృష్ణ తండ్రి వీరపనేని శివాజీ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉండేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వీరపనేని శివాజీ అత్యంత సన్నిహితుడు. మారుమూల ప్రాంతం నుంచి ఒక గొప్ప మహానేతగా శివాజీ ఎదిగారు.

  చిన్న నిర్ల‌క్ష్యం ఊరు మొత్తాన్ని ముంచేసింది .. చాప కింద నీరు గ్రామాల్ని చుట్టేస్తోంది

  ఐతే వీరపనేని శివాజీ మావోయిస్టుల హిట్ లిస్ట్ పేరులో ఉన్నాడని వార్తలు రావడంతో..  పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకొని తన నివాసాన్ని మార్చుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరపనేని శివాజీ గోవిందరావుపేట్లో పేద ప్రజలకు నాలుగు వందల పక్కా ఇండ్లను కట్టించారు. వాటికి ఏకంగా NT రామారావు కాలనీ అని నామకరణం కూడా చేశారు. ఇంతటి మహోన్నత వ్యక్తిని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆయన జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు శివాజీ విగ్రహాన్ని గోవిందరావుపేట గ్రామంలో ఏర్పాటు చేశారు.

  తన మామగారైన వీరపనేని శివాజీ విగ్రహ ఆవిష్కరణకు ప్రముఖ గాయని , డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంత మంచి కుటుంబానికి కోడలిగా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.  ఇక్కడి ప్రజలను చూస్తుంటే ఎంతగానో సంతోషంగా ఉందని సునీత అన్నారు. తన మామ గారి గురించి అందరూ పొగుడుతుంటే మహోన్నత వ్యక్తి అని ఆనందంగా ఉందని సునీత చెప్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Local News, Mulugu, Singer Sunitha, Telangana, Tollywood

  ఉత్తమ కథలు