Home /News /telangana /

DIWALI BOMBS RATES ARE DOUBLE PRICE IN HYDERABAD DUE TO SHORTGE VRY

High rates : మండుతున్న దిపావళీ టపాసులు.. కరోనా.. శివకాశీ పరిణామాలతో పేలుతున్న రేట్లు..

High rates : మండుతున్న దిపావళీ టపాసులు..

High rates : మండుతున్న దిపావళీ టపాసులు..

High rates : తమిళనాడులోని శివకాశీలోని పరిణామాలు.. కరోనా ఎఫెక్ట్‌లోపాటు అధికారుల ఒత్తిడిలు వెరసి దిపావళీ బాంబుల కొరత ఏర్పడింది.. దీంతో రేట్లు డబుల్ అయ్యాయి. దీపావళీకి సంతోషంగా టపాసులు కాల్చుదాం అనే వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు..

ఇంకా చదవండి ...
    దీపావళి పండగ అంటేనే వెలుగులు జిమ్మే పటాకుల పండగ. పండగరోజున పిల్లలు, పెద్దలు ఎంతో హడావిడిగా బాణా సంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి రోజున సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ క్రాకర్స్ వెలుగులతో ప్రతి వీధి కళకళలాడుతుంది. బాణా సంచాకాల్చడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడుతుంటారు. కానీ ఈ సారి దీపావళి పండగ సందర్భంగా టపాసుల ధరలు చూసి కొనుగోలు దారులు కంగు తింటున్నారు. ఒక పక్క బాణాసంచా కాల్చేవారి సంఖ్య తగ్గుతున్న నేపధ్యంలో తాజాగా వాటి ధరలు మరింతగా మండిపోతున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే బాణా సంచా ధరలు రెట్టింపు పెరిగాయి.

    గత సంవత్సరం ఉన్న వాటికి ప్రతి ఐటమ్ కూడా డబుల్ అయినట్టు వినియోగదారులు చెబుతున్నారు. ఇరవై అయిదు రూపాయలు ఉన్న క్రాకర్స్ 50 రూపాయలు అమ్ముతున్నారని వాపోయారు... చిచ్చుబుడ్డి ధరలు డజన్ డజన్ కు చిన్న సైజువి 100 రూపాయలు కాగా ఈసారి 150 రూపాయలు పలికింది.

    ఇది చదవండి : పూజ ముందు పెట్టిన డబ్బులు మాయం.. రెండున్నర లక్షలను బాత్రూం కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు...


    అలాగే బాంబుల విషయానికి వస్తే సీమ టపాకాయల ప్యాక్ ధర గత సంవత్సరం 50 రూపాయలు ఉంటే సారి 100 రూపాయలకు అమ్మకాలు చేశారు. ఇక థౌజండ్ వాలా, లాంటివి ఒక్కోటి 500 నుంచి 1000 రూపాయలు పలికాయి. గత సంవత్సరంకంటే ఈ సారి కొన్ని రకాల ఐటమ్స్ ధరలు మూడురెట్లు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

    ఇది చదవండి : చేసింది గుళ్లో దొంగతనం.. అయినా.. అమ్మవారి మీద భక్తి ఎక్కువే.. వైరల్‌గా మారిన వీడియో..


    దీంతో కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపుతున్నట్టు వ్యాపారుల చెబుతున్నారు. తక్కువ స్థాయిలో వినియోగదారులు వస్తున్నా ధరలు చూసి తక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు, తమిళనాడులోని శివకాశీలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో పాటు పలు కారణాలతో ఈ సారి టపాసుల ఉత్పత్తి పెద్దగా కొనసాగించలేదని తేలింది. దీంతో ఉన్న వ్యాపారులు కాస్తా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు కొన్ని చోట్ల ధరలు తక్కువగానే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న చోట అనుగూణమైన ధరలు ఉన్నట్టు మరికొందరు వినియోగదారులు చెబుతున్నారు. ఏది ఏమైనా... గతంతో పోల్చితే... ప్రస్తుత సంవత్సరం టపాసుల మంటలు ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Diwali 2021, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు