Home /News /telangana /

DIWALI 2020 CRACKERS WITH HUGE SOUNDS ARE BANNED IN HYDERABAD SAYS CP ANJANI KUMAR BA

దీపావళి టపాసులు కొనేముందు హైదరాబాద్ సీపీ హెచ్చరికను చదవండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దీపావళి సందర్భంగా జంటనగరాల్లో భారీ శబ్ధాలుచేసే బాణాసంచా కాల్చడం పై నిషేధం విధించినట్టు హైదరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

    దీపావళి సందర్భంగా జంటనగరాల్లో భారీ శబ్ధాలుచేసే బాణాసంచా కాల్చడం పై నిషేధం విధించినట్టు హైదరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈనెల 12వ తేదీ ఉదయం 6గంటల నుంచి 16వ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. దీపావళి రోజున రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే బాణాసంచా అనుమతిస్తామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిర్ధేశించిన పరిమాణంలోనే శబ్ధం వచ్చే క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలని అన్నారు. మెయిన్‌రోడ్లు, పబ్లిక్‌ ఏరియాల్లో బాణాసంచా కాల్చడాన్ని కూడా నిషేధించినట్టు ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై హైదరాబాద్‌ పోలీస్‌యాక్ట్‌, 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.

    సుప్రీంకోర్టు తీర్పు ఏంటి?
    వాయు కాలుష్య భూతాన్ని నియంత్రించడానికి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజున కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను అతిక్రమించి గడువు దాటిన తరువాత ఎవరైనా పటాసులు పేలిస్తే వారిపై సుమోటోగా కేసులు పెట్టే అధికారం పోలీసులకు ఉంటుంది. వాయు కాలుష్యం వల్ల పట్టణాల్లో నివశిస్తోన్న వారి పరిస్థితి రోజురోజుకూ అత్యంత దారుణంగా తయారవుతోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ మొత్తం జనాభాలో సగం నగరాలలోనే నివసిస్తున్నారని ప్రాథమిక సర్వేలు చెబుతున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Diwali 2020, Fire crackers

    తదుపరి వార్తలు