Home /News /telangana /

DISTRICT WOMEN COLLECTOR AND MLA VISITED THE RAIN DAMAGED ROADS AND VILLAGES IN AN AUTO IN ADILABAD DISTRICT SNR ADB

Telangana : జిల్లా లేడీ కలెక్టర్ , మహిళా ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఆటోలో వెళ్లారు .. ఎందుకో ఎక్కడికో తెలుసా

collector mla

collector mla

Adilabad: ఒకరు జిల్లా కలెక్టర్‌. మరొకరు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆ ఇద్దరూ మహిళలకు కారులో దర్జాగా తిరిగే అధికారం, అవకాశం ఉంది. కాని ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరూ కలిసి ఆటోలో ప్రయాణించారు. కొద్ది దూరం కాలినడక ప్రయాణించారు. హై పొజిషన్‌లో ఉన్న ఇద్దరు మహిళలకు ఆటోలో వెళ్లాల్సినంత అవసరం ఎందుకొచ్చిందో తెలుసా.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    ఒకరేమో జిల్లాకే ఉన్నతాధికారి(District Collector). జిల్లాలో ఏ స్థాయి పనులకైనా ఆఫీసులో కూర్చొని ఆదేశిస్తే చాలు అమలు చేయడానికి కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది రెడీ ఉంటారు. మరొకరమో నియోజకవర్గానికే ప్రజాప్రతినిధి(MLA). భద్రత సిబ్బంది నడుమ అధికారిక వాహనాల్లో కాలు కింద పెట్టకుండా తిరగవచ్చు. అలాంటి ఇద్దరూ మహిళలు అనుకోకుండా ఆటోలో ప్రయాణించాల్సి వచ్చింది. ఆటో(Auto)లోనే కాదు మరికొద్ది దూరం కాలి నడకన వెళ్లాల్సి వచ్చినప్పటికి వారి హోదా, అధికారాలు పక్కనపెట్టి ఆటో ఎక్కారు. ఇంతకీ ఆ ఇద్దరూ మహిళలు ఎవరూ..ఉన్నతస్థాయిలో ఉన్న వాళ్లకు ఆటో ఎక్కాల్సిన అవసరం వర్షాలు, వరదల వల్ల వచ్చింది.

    Mulugu: వరద బాధితులకు సహాయం చేపట్టాలి: అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం



    వర్షనష్టంపై అంచనా..
    గత వారం, పది రోజుల నుంచి జోరున వాన, వరదతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కల్వర్టులు తెగిపోయాయి, రోడ్లు కోతకు గురయ్యాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి, నష్టాన్ని అంచనా వేయడానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో పాటు ఖానాపూర్ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్ వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు.



    ఆటోలో ప్రయాణం..
    ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు కరెక్టర్, ఎమ్మెల్యే. అవి ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో ఉట్నూరు మండలం వడ్‌గావ్ నుండి పాటగూడ, హీరాపూర్, లాల్ టేకిడి వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే రేఖా నాయక్ కారులు వెళ్లే మార్గం లేకపోవడంతో ఇద్దరు కలిసి ఆటోలో ప్రయాణించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లను పరిశీలీంచారు. మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా వేరే వాహనాలలో ప్రయాణించి రహదారులు, వంతెనలు, పంటపొలాలను సందర్శించారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న చోట్ల కాలి నడకన వెళ్లారు.

    Asifabad: పంట నష్టంపై నివేదిక సిద్దం చేయండి : జిల్లా యంత్రాంగానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆర్డర్



    అధికారం, హోదా పక్కనపెట్టి..
    ఒకరు మహిళా ఉన్నతాధికారిణి, మరొకరు మహిళా ప్రజాప్రతినిధి దస్నాపూర్, పిట్టబొంగారం గ్రామాలను సందర్శించారు. గండి పడిన మత్తడిగూడ చెరువును కూడా పరిశీలీంచారు. స్థానికులు, రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, వరద వల్ల కోతకు గురైన రహదారులు, వంతెనలకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో సహాయక పనులను చేపట్టాలని అన్నారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులకు నిర్ధేశించారు. ప్రజల అవస్థలు, సమస్యలను ప్రత్యక్షంగా చూసుకోవాల్సింది అధికార, పాలక యంత్రాంగమే. అలాంటి వాళ్లకే స్వయంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రజల అవస్థలు పరిశీలించడానికి ఈ విధంగా సాదాసీదాగా రావడం చూసి అందరు ఆశ్చర్యపోయారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Telangana News

    తదుపరి వార్తలు