హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: మదర్స్ డే సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ.. ప్రతీ కుటుంబంలో రూ. 2 వేల చొప్పున..

Telangana: మదర్స్ డే సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ.. ప్రతీ కుటుంబంలో రూ. 2 వేల చొప్పున..

మహిళలకు నిత్యావసరాలను అందిస్తున్న సంస్థ సభ్యులు

మహిళలకు నిత్యావసరాలను అందిస్తున్న సంస్థ సభ్యులు

Telangana:  మాతృ దినోత్సవం సందర్భంగా కరోనా సమయంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నేనున్నానంటూ ముందుకు వచ్చింది యువసేన ఫౌండేషన్, ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మేరి లాండు చాప్టర్. కరీంనగర్ లో 45 కుటుంబాలకు రూ.2 వేలు విలువగల నెల రోజుల నిత్యావసర సరుకులు అందించారు.

ఇంకా చదవండి ...

కరీంనగర్ పట్టణంలో కోతిరాంపూర్ లో మేముసైతం యువసేన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చకిలం స్వప్న- శ్రీనివాస్ మరియు NRI వాసవి అసోసియేషన్ మేరీ లాండ్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో 45 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, నెలకు కు సరిపడా రైస్ బ్యాగ్ లని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చకిలం స్వప్న -శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభించడంతో పేదకుటుంబాలకు పనిలేకుండా పోయిందన్నారు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రాగానే వెంటనే మేము స్పందించి వారికి నెలకు సరిపడా బియ్యం, వంట సామాను నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. మాతృ దినోత్సవం రోజున ఇలా పేదలకు అందించడం సంతోషంగా ఉందన్నారు. పేద వారికి సహాయం చేయడం అంటే తాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు పంపిణీ చేశామన్నారు.

మా మేముసైతం యువసేన ఫౌండేషన్ మరియు నారి వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సేవ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. మాతృ దినోత్సవం గురించి మాట్లాడుతూ.. అమ్మ లేనిది ఈ స్పష్టి శూన్యంమని.. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎంత ఎదిగినా అమ్మను గౌరవించాలని కోరారు. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

First published:

Tags: Essential commodities, Happy mothers day, Helping, Karimnagar

ఉత్తమ కథలు