న్యూస్ 18 మహబూబ్ నగర్...
సయ్యద్ రఫీ
కన్న తండ్రి లేదా తల్లి చనిపోతే అవసరాలను బట్టి వారి సంతానం వ్యవహరిస్తున్నారు..పరిస్థితుల నేపథ్యంలోనే తల్లిదండ్రుల దహానసంస్కారాలు కూడ చేయని పిల్లలు అనేకమంది ఉన్నారు. తమను పెంచి పోషించిన తల్లిదండ్రులను చివరి చూపు కూడా చూడకుండా అనాథ ఆశ్రమాల్లో వేసి అటునుండి అటే స్మశానానికి పంపుతున్న సంఘటనలు సమాజాంలో చూస్తున్నాము.
అయితే ఇలాంటీ సంఘటనలే కాదు తండ్రికి దహన సంస్కారాలు చేయడం తమవంతు బాధ్యతగా గుర్తుండి అందుకు అనుగుణంగా నడుకుచుకునేవారు సమాజంలో ఉన్నారు..అవసరమైతే ఇందుకోసం ఘర్షణపడే వారు కూడ ఉంటారు..ఈ నేపథ్యంలోనే ఓ తండ్రి చనిపోతే నేనంటే నేనంటూ దహానసంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చారు..ఇద్దరు ఎలా చేస్తారనే ప్రశ్న రావడంతో పోలీసు స్టేషన్కు సైతం వెళ్లారు..అక్కడ కూడ తేలకపోవడంతో ఇద్దరు కలిసి తండ్రికి కుండపట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. మహబుబ్నగర్ జిల్లా, గునుమక్కల గ్రామ మాజీ సర్పంచ్ సాలె కథలప్ప అనారోగ్యంతో మృతి చెందాడు..అయితే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు.వారిలో పెద్ద భార్యకు ప్రస్తుత గ్రామ సర్పంచ్ చంద్రయ్య, తిమ్మయ్య అనే ఇద్దరు కుమారులతో పాటు మరో కూతురు ఉండగా రెండో భార్యకు కుమారుడు కృష్ణ మోహన్ మరియు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
మృతి చెందిన కథలప్పకు అంత్యక్రియలను నిర్వహించేందుకు సిద్దమయిన నేపథ్యంలో పెద్ద భార్య కుమారుడు ప్రస్తుత సర్పంచ్ అయిన చంద్రయ్యకు, చిన్న భార్య కుమారుడు అయిన క్రిష్ణమోహన్కు మధ్య వివాదం ఏర్పడింది. తామంటే తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టి కూర్చున్నారు..ఇక చంద్రయ్యే ఊరికి సర్పంచ్ కావడంతో పెద్దలు కూడ రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కాని ఎక్కడ వివాదం సమసి పోలేదు..దీంతో ఇద్దరు పోలీసు స్టేషన్కు వెళ్లారు. అక్కడ కూడ ఇదే సందిగ్థత నెలకొంది.
దీంతో ఇద్దరు కుమారులు కలిసి తండ్రి అంతిమయాత్ర ముందు చేతిలో చెంబు పట్టుకొని బయల్దేరి, అంత్యక్రియల కార్యక్రమాలను ఎవరికి వారుగా వేరు వేరు నిర్వహించుకొని వెళ్లిపోయారు. సాధారణంగా తండ్రికి ఎవరో ఒకరు కుండ పడతారు. కాని ఇక్కడ ఇద్దరు పట్టడడంతో చుట్టుపక్కల గ్రామాల్లో కథలప్ప అంతిమయాత్ర చర్చనీయంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Telangana