Home /News /telangana /

DISPUTE AGAINST FINES ON VEHCLE STICKERS IN HYDERABAD VRY

Hyderabad : వివాదస్పదం అవుతున్న స్టిక్కర్స్.. అలాంటి నిబంధనలు రవాణశాఖలో లేవంటున్న అధికారులు...

స్టిక్కర్స్ పై స్పెషల్ డ్రైవ్

స్టిక్కర్స్ పై స్పెషల్ డ్రైవ్

Hyderabad : నిబంధనలకు అనుగుణంగానే స్టిక్కర్లు ఉన్న వాహానాలకు పోలీసులు జరిమానాలు విధిస్తున్నారా.. మరి వివాదస్పదం ఎందుకు అవుతుంది..? జరిమానాలపై రవాణాశాఖ అధికారులు ఏం చెబుతున్నారు..

    గత వారం రోజులుగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్నా జరిమానాలు వివాదస్పదం అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న వాహనం ప్రమాదం జరిగిన తర్వాత గాని అలర్ట్ గాని పోలీసులు నగర కమీషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా హెల్మెట్, లేదా వెహికిల్ రిజిస్ట్రేషన్ , డ్రైవింగ్ లైసెన్స్ చూసే పోలీసులు తాజాగా పలు వాహనాలపై అనధికార స్టిక్కర్స్ అంటూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో వాహానాలపై పోలీస్ Police, ఆర్మీ(Army) డిఫెన్స్(Defense), ప్రెస్ (Press), ఎమ్మెల్యే(MLA), జీహెచ్‌ఎంసీ (Ghmc), డాక్టర్(Doctot), అడ్వకేట్(Advocate) అని స్టిక్కర్లు ఉన్న వాహానాలపై 700 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. దీంతో వాహానాలకు బ్లాక్ ఫిలిం ఉంటే వాటిని అక్కడే తొలగించి ఫైన్ వేస్తున్నారు.

    అయితే ఇదంతా నిబంధనల ప్రకారం జరుగుతుందా అనే చర్చ కొనసాగుతోంది. పోలీసు వాహానాలపై పోలీస్ అనే స్టిక్కర్ తప్పనిసరిగా ఉంటుంది. అదే విధంగా జుడిషియరికి సంబంధించిన వాటితోపాటు ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు ,లేదా వాహానాలు తమ ఐడెంటిని తెలిపే స్టిక్కర్స్‌ను అంటిస్తారు. అయితే ఇప్పుడు ఇదే పోలీసులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఈ స్టిక్కర్స్‌తో కొంతమంది ఫేక్ గాళ్లు కూడా వీటితో మోసం చేయడంతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో మొత్తం స్టిక్కరింగ్ వ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. ఎవరో కొద్దిమంది చేస్తున్న నేరాలను సమాజంలో బాధ్యత గల్గిన వ్యక్తులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ తనిఖీలు చేపడుతున్నారు.

    Hyderabad : దర్జాగా ఫ్లైట్‌లో వస్తాడు.. సింపుల్‌గా మెడలోని గొలుసులు తెంచుతాడు.. కాని...

    అయితే ఇదిలా ఉంటే అసలు కేంద్రప్రభుత్వ చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నామని చెబుతున్న పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అలాంటీ చట్టాలు రవాణాశాఖలో లేవని రవాణా శాఖ మాజీ అధికారులతో పాటు ప్రస్తుత అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే పోలీసు చట్టం ప్రకారం ఏదైనా ఉన్నాయో వారే చెప్పాలని అంటున్నారు. కేవలం నెంబర్ ప్లేట్ పై మాత్రమే ఎలాంటీ స్కిక్కర్లు అంటించవద్దనే నిబంధనతో పాటు బ్లాక్ ఫిలింకు సంబంధించి నిబంధనలు ఉన్నాయంటున్నారు. ఇలా చేసినప్పుడే జరిమానాలు విధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.



    కాగా ఈ క్రమంలో కొంతమంది జర్నలిస్టులకు సైతం జరిమానాలు విధించడంతో ఆ సంఘం నేతలు ట్రాఫిక్ అధికారులను కలిసి చర్చించారు.దీంతో నాలుగు రోజుల పాటు వారిపై జరిమానాలు విధించమని ఆ తర్వాత సంబంధిత కంపనీల నుండి ఐడెంటీ కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. దీంతో జర్నలిస్టులతో పాటు పలువురు పోలీసుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని నిబంధనల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Traffic police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు