దేశవ్యాప్తంగా దిశ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై (Disha encounter case) సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ (Justice Sirpurkar Commission) ప్రశ్నించింది. మృతుల కుటుంబ సభ్యలు నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. పంచానామా నిర్వహించిన సమయంలో పాటించిన నియమ, నిబంధనలు గురించి వారి నుంచి వివరాలు సేకరించింది. అంతేకాకుండా ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులను కూడా విచారిస్తోంది. విచారణకు హాజరవుతున్న వారిని సిర్పుర్కర్ కమిషన్ సభ్యులు పలు రకాలుగా విచారిస్తున్నారు. వారిపై అనేక కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు. సిట్ చీఫ్‌గా ఉన్న రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను కమిషన్ విచారించింది. విచారణలో భాగంగా మహేష్ భగవత్‌పై(Mahesh Bhagwat) కమిషన్ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగినందున అప్పటి కమిషనర్ వీసీ సజ్జనార్‌ను(VC Sajjanar) , శంషాబాద్ జోస్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిలను విచారించారా? అని మహేశ్ భగవత్‌ను కమిషన్ ప్రశ్నించింది. ఇందుకు ఆయన విచారించలేదని బుదులిచ్చారు. ఇంత సంచలనం సృష్టించిన కేసులో సీపీని, డీసీపీని ఎందుకు విచారించలేదని అనిపించలేదా..? అని అడగ్గా.. అవసరం లేదనిపించిందని మహేష్ భగవత్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సిట్ దర్యాప్తులో గుర్తించిన అంశాలపై కూడా ఆయను నుంచి వివరాలు సేకరించింది.
నిందితులు ఎదురు దాడికి దిగినప్పుడు పోలీసులకు గాయాలయ్యాయని నివేదికలో రాసినప్పటికీ.. ఆ వివరాలు ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించింది. కేసు దర్యాప్తుపై రాసిన డైరీపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను విచారించేందుకు సిర్పుర్కర్ కమిషన్ సిద్దమైనట్టుగా తెలుస్తోంది.. ఈ నెల 29న ఆయనను సిట్ విచారించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
ఇక, ఎన్‌కౌంటర్ ఘటనపై ఏర్పాటైన సిట్ సంబంధించిన కేసు డైరీ రాసిన వనపర్తి ఎస్పీ అపూర్వారావును కూడా సిర్పుర్కర్ కమిషన్ శనివారం విచారించింది. దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు వినియోగించిన బుల్లెట్స్ లెక్క కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఆయుధాల రిజిస్టర్ తనిఖీ చేశారా అని కమిషన్ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. ఇందుకు ఆమె తనిఖీ చేయలేదని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లుగా చెబుతున్న పోలీసులకు చికిత్స జరిగిన ఆసుపత్రిని సందర్శించిన సమయంలో వారు ఐసీయూలో ఉన్నారా? సాధారణ వార్డులో ఉన్నారా అని ప్రశ్నించగా.. సాధారణ వార్డులోనే ఉన్నారని ఆమె బదులిచ్చారు. అయితే మరి వారికి తీవ్రంగా గాయలైనట్టుగా సిట్ నివేదికలో ఉందని.. అలాంటప్పుడు జనరల్ వార్డులో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు.
YS Jagan: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సహాయం.. అలా సీఎం కార్యాలయం నుంచి పిలుపు..
శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని కూడా కమిషన్ ప్రశ్నించింది. అయితే విచారణలో భాగంగా కమిషన్ సభ్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయారి సమాచారం. ఇక, ఆయన ఇచ్చిన సమాధానంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha accused Encounter, Sajjanar