Home /News /telangana /

DISHA CASE ENCOUNTER WHAT KIND OF REPORT TO PREPARE BY NHRC NK

జరిగింది ఎన్‌కౌంటరేనా? NHRC ఏం చెప్పబోతోంది?

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు

Disha Case Encounter : ఢిల్లీ నుంచీ వచ్చిన NHRC సభ్యులు... ఎన్‌కౌంటర్ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. మరి ఏ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు?

  Disha Case Encounter : దిశ హత్యాచారం కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై చాలా మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంటే... మానవ హక్కుల సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు మాత్రం ఎన్‌కౌంటర్‌పై సందేహాలు వ్యక్తం చేశాయి. నిందితులు సామాన్యులు కాబట్టి పోలీసులు వాళ్లను ఎన్‍‌కౌంటర్ పేరుతో చంపేశారనీ... అదే ఏ ఎమ్మెల్యే కొడుకో తప్పు చేసి ఉంటే ఇలా చేసేవారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన ఏడుగురు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుల (వీరిలో ఒకరు ఫోరెన్సిక్ నిపుణుడు)పై కొందరు ప్రజల నుంచీ వ్యతిరేకత, విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలాంటివి పట్టించుకోని NHRC టీమ్... శనివారం రోజంతా... ఎన్‌కౌంటర్ అంశంపై దర్యాప్తు చేసింది. అంటే... HRC సభ్యులు చటాన్‌పల్లిలో దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనా స్థలాల్ని పరిశీలించారు. 'దిశ' మృతదేహాన్ని నిందితులు దహనం చేసిన ప్రాంతాన్ని వెళ్లి చూశారు. కొన్ని వీడియోలు తీశారు. అలాగే ఘటనకు సంబంధించి పోలీసుల దగ్గర వివరాలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచిన నలుగురు నిందితుల మృతదేహాల్ని సభ్యుల బృందం పరిశీలించింది. పోస్ట్‌మార్టం రిపోర్టులోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణుల్ని పిలిపించి మాట్లాడింది. మూడు గంటలకు పైగా ఆస్పత్రిలోనే ఉన్న బృందం... తర్వాత మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఘటనపై వారి వాంగ్మూలాలు తీసుకుంది. ఇప్పుడు NHRC ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతోంది? జరిగింది ఎన్‌కౌంటరేనా? లేక పోలీసులు కావాలని వాళ్లను చంపేశారా? అన్న ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది.

  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. షాద్‌నగర్‌ దగ్గర్లో నవంబర్ 27న వెటర్నరీ వైద్యురాలిపై నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, నవీన్‌, శివ, చెన్నకేశవులు అత్యాచారం చేసి, తర్వాత ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టి చంపేశారు. ఈ క్రమంలో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... శుక్రవారం క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో జరిపిన కాల్పుల్లో వారు చనిపోయినట్లు తెలిపారు.

  ప్రస్తుతం నిందితుల మృతదేహాల్ని పాలమూరు మెడికల్ కాలేజీకి తరలించారు. ఐతే... ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే స్పందించారు. న్యాయం ప్రతీకారం కాకూడదన్న ఆయన... ఇన్‌స్టంట్ జస్టిస్ సరికాదన్నారు. తద్వారా ఎన్‌కౌంటర్‌ను పరోక్షంగా వ్యతిరేకించినట్లైంది.


  Pics : సెలబ్రిటీలను కట్టిపడేస్తున్న ఆస్థా శర్మ ఫ్యాషన్ డిజైన్స్
  ఇవి కూడా చదవండి :

  జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ

  Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

  Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


  Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


  Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Disha murder case, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు