Home /News /telangana /

DISHA CASE ENCOUNTER MINISTER EETELA COMMENTS ON DISHA CASE ENCOUNTER NK

ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

Disha Case Encounter : దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వానికి అనుకూలంగా చాలా మంది ప్రజలు నిలిచారు. సీఎం కేసీఆర్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. మరి మంత్రి ఈటల ఎందుకలా అంటున్నారు?

    Disha Case Encounter : దిశ హత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే అయ్యంది. హత్యాచారం తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను చాలా మంది సమర్థించారు. ఆ తర్వాత దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌కి మద్దతు ఇస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, చాలా మంది ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఐతే... దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వేర్వేరు వాదనలు వినిపిస్తున్నారు. దిశ 100కు కాల్ చేసి ఉంటే బతికేదని హోంమంత్రి మహ్మద్ ఆలీ ఆభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం సాధ్యం కాదని మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. దిశ ఎన్‌కౌంటర్‌పై ఇదే మంత్రి తలసాని మరోలా మాట్లాడారు. ఇది సీఎం కేసీఆర్ ఉగ్రరూపం అన్నారు. కేసీఆర్ మౌనాన్ని తక్కువ అంచనా వేశారని, ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. తలసానితో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ ఎన్‌కౌంటర్‌ను గట్టిగా సమర్ధించారు. మంత్రి ఈటెల రాజేందర్ అభిప్రాయం మాత్రం తెలంగాణ మంత్రుల అభిప్రాయానికి పూర్తి భిన్నంగా ఉంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ఆయన పరోక్షంగా తప్పుపట్టినట్లు ఉన్నాయి ఆయన  వ్యాఖ్యలు. దిశ లాంటి ఘటనల్లో ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ఉరిశిక్షలు కూడా పరిష్కారం కాదనీ, అవి తాత్కాలిక పరిష్కారాలేనని అన్నారు. సమాజంలో మార్పు రావాలని ఈటల కోరారు. సెల్‌ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ జీవితాన్ని విధ్వంసం చేస్తున్నాయనీ, తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బయటికి వెళ్తే క్షేమంగా వస్తామన్న నమ్మకం లేదనీ, కంచే చేను మేసినట్లు పిల్లలపై తండ్రులే క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈటెల చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఎన్‌కౌంటర్‌ను ఆయన సమర్థిస్తే... ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లే. అదే వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చెయ్యడం వల్ల... అవి ప్రభుత్వానికి ఇబ్బందికరమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే... ప్రభుత్వంపై అసంతృప్తితోనో, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొనో ఈటల ఈ వ్యాఖ్యలు చేసి ఉండరనీ, జనరల్‌గా ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఆయన అలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటారని కొందరు మంత్రులు అంటున్నారు.


    Pics : గోల్డెన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న కైలీ జెన్నర్



    ఇవి కూడా చదవండి :



    "హ్యాట్"ట్రిక్ అదిరిందిగా... ట్విట్టర్‌లో వైరలే వైరల్...

    CISF ఆఫీసర్ అరెస్ట్... చివర్లో ట్విస్ట్...

    ట్రంప్ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందన్న జూనియర్ ట్రంప్

    నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు

    ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు