Home /News /telangana /

DISHA ACCUSED ENCOUNTER HERE IS POLICE VERSION SK

దిశా నిందితుల ఎన్‌కౌంటర్.. పోలీసులు ఏం చెబుతున్నారు?

దిశా హత్య కేసు నిందితులు

దిశా హత్య కేసు నిందితులు

తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు

    దిశా హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొత్తం నలుగురినీ ప్రియాంకను తగులబెట్టిన చోటే కాల్చిచంపారు పోలీసులు. ఐతే పోలీసులు ఎందుకు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు.

    తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు. తెల్లవారుజామున 03.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన తెలుస్తోంది. కోర్టు అనుమతితో చర్లపల్లి జైలు నుంచి నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Disha murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు