Home /News /telangana /

DISHA ACCUSED ENCOUNTER DISHA PARENTS REACTION ON ACCUSED MURDER SK

నిందితుల ఎన్‌కౌంటర్‌పై దిశా తల్లి దండ్రుల ఫస్ట్ రియాక్షన్

దిశా హత్య కేసు నిందితులు

దిశా హత్య కేసు నిందితులు

దిశను కిరాతకంగా చంపేపిన మృగాలను ఎన్‌కౌంటర్ చేసినందుకు సంతోషంగా ఉందని.. తమ కూతురికి న్యాయం జరిగిందని తల్లిదండ్రులు చెప్పారు. నిందితులకు సరైన శిక్షే పడిందని తెలిపారు.

    దిశాను రేప్ చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన రేపిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై దిశా తల్లిదండ్రులు స్పందించారు. దిశను కిరాతకంగా చంపేపిన మృగాలను ఎన్‌కౌంటర్ చేసినందుకు సంతోషంగా ఉందని.. తమ కూతురికి న్యాయం జరిగిందని చెప్పారు. నిందితులకు సరైన శిక్షే పడిందని తెలిపారు. తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు మాత్రం కరెక్టు పని చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో ఇకపై అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి వెన్నులో వణుకు పడుతుందని అభిప్రాయపడ్డారు.

    కాగా, దిశా కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు. తెల్లవారుజామున 03.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Disha murder case, Telangana Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు