Home /News /telangana /

DISHA ACCUSED CHENNAKESAVULU WIFE RENUKA GIVES BIRTH TO A BABY GIRL SK

Disha Case: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య..

చెన్నకేశువులు భార్య రేణుక

చెన్నకేశువులు భార్య రేణుక

రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా హత్యాచారం కేసు నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రేణుకా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది రేణుక. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.

    నవంబరు 27న పశు వైద్యురాలు దిశ (పోలీసులు పెట్టిన పేరు)పై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు రోజుల తర్వాత దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అరెస్ట్ అయ్యారు. ఐతే డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురూ చనిపోయారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. దీనిపై కేసు నమోదు కావడంతో అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబరు 6న ఎన్‌కౌంటర్ జరిగితే.. డిసెంబరు 23న నలుగురు నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Disha murder case, Disha rape, Shadnagar encounter

    తదుపరి వార్తలు