హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Traffic e-challan: 75% Discount ట్రాఫిక్ పోటెత్తడంతో ఈ-చలాన్ సర్వర్ డౌన్

Telangana Traffic e-challan: 75% Discount ట్రాఫిక్ పోటెత్తడంతో ఈ-చలాన్ సర్వర్ డౌన్

ఈ-చలాన్ వెబ్ సైట్ క్రాష్

ఈ-చలాన్ వెబ్ సైట్ క్రాష్

75 శాతం డిస్కౌట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు వాహ‌నాదారులు పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చోప్పున క్లియరెన్సులు, ప్రభుత్వానికి గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయలు కానీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో సర్వర్ కుప్పకూలింది.

తెలంగాణ వ్యాప్తంగా సుదీర్గకాలంగా పెండింగ్ లో ఉన్న చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. గరిష్టంగా 75 శాతం డిస్కౌట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు తొలి రోజు నుంచే వాహ‌నాదారులు పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చోప్పున క్లియరెన్సులు కాగా, ప్రభుత్వానికి గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అయితే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ-చలాన్ సర్వర్ కుప్పకూలింది. వెబ్ సైట్ క్రాష్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

తెలంగాణ పోలీసులు మార్చి 1 నుంచి 30వ తేదీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తొలిరోజే ఊహించని రీతిలో విశేష స్పందన లభించింది. ఉదయం నుంచే వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వాహనదారులు తమ వాహనం పేరిట ఉన్న చలానాలను చెల్లిస్తున్నాడు. ఇందుకోసం పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, నెట్‌బ్యాంకింగ్‌లతో పాటు మీసేవ/ఈసేవ కేంద్రాల్లోనూ జరిమానాలు చెల్లించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే ఒకే సమయంలో వేలాది మంది వాహనదారులు చెల్లింపునకు ప్రయత్నిస్తుండటంతో వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. పేమెంట్‌ గేట్‌ వే వద్ద ఎక్కువగా సమస్య వస్తుందని వాహనదారులు వాపోతున్నారు.

Traffic Challans: 75% Discount సక్సెస్: నిమిషానికి 700 క్లియరెన్సులు.. గంటల్లో రూ.కోట్లు జమ


మరోవైపు పెండింగ్‌ చలానాలు చెల్లించేవారు.. ఒక్కసారిగా ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళితే సర్వర్‌ కుప్పకూలకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని, సర్వర్‌ సామర్థ్యాన్ని పదిరెట్లు పెంచామని పోలీసు వర్గాలు తెలిపాయి. తొలిరోజు 1-3 లక్షలమంది చెల్లించే అవకాశాలున్నాయన్న అంచనాతో సర్వర్‌ను సిద్ధం చేశారు. ప్రతి వాహనదారు కనీసం 30 సెకన్లు ఆలోచించాలన్న భావనతో జరిమానా చెల్లించేప్పుడు వాహనం రిజిస్ట్రేషన్‌ నంబరుతో పాటు ఇంజిన్‌ నంబరులో చివరి నాలుగు అంకెలు కూడా నమోదుచేయాలన్న ఆప్షన్ ఉంచారు. అయితే పోలీసు అధికారుల అంచనాలకు మించి వాహనదారులు ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సర్వర్‌ కుప్పకూలింది.

CM KCR: PM Modi ఇలాకా వారణాసిలో కేసీఆర్ ప్రచారం! -బీజేపీపై యుద్ధం ముమ్మరం..


మరోవైపు రాయితీపై చలాన్లు చెల్లించే సదుపాయం ఈనెల 31 వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉందని ట్రాఫిక్ పోలీసులు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. టూ వీలర్ వాహనదారులకు 75 శాతం రాయితీని ప్రకటించగా.. కార్లు, మోటార్ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ ఇచ్చారు. అలాగే తోపుడు బండ్ల నిర్వాహకులకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీలను ప్రకటించారు. దీంతో పాటుగా మాస్కు ధరించకుండా తిరిగిన వారికి విధించిన రూ.వెయ్యి రూపాయల జరిమానాకు బదులు కేవలం రూ.వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు ప్రకటించారు.

Manchu Vishnu ఆఫీసులో చోరీ: కులం పేరుతో Manchu Family అమ్మ‌నా బూతులు: హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను


పెండింగ్ ఈ చ‌లాన్ల చెల్లింపుల ద్వారా కేవలం 8 గంటల్లోనే సర్కారువారికి రూ. 1.77 కోట్లు జ‌మ అయ్యాయి. ఈ చలాన్ల వెబ్‌సైట్‌ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ ద్వారా ఈజీగా క్లియరెన్సులు చేసుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు ఈ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపాయి. పేద, మధ్య తరగతి ప్రజలు గత రెండేండ్లుగా కొవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నదని పోలీసులు గుర్తుచేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Hyderabad Traffic Police, Telangan traffic police, Telangana, Traffic challans

ఉత్తమ కథలు