Home /News /telangana /

DISCOUNTS ON TRAFFIC CHALLANS SUPER SUCCESS AS 700 CHALLANS ARE CLEARED EVERY MINUTE SAYS HYDERABAD TRAFFIC POLICE MKS

Traffic Challans: 75% Discount సక్సెస్: నిమిషానికి 700 క్లియరెన్సులు.. గంటల్లో రూ.కోట్లు జమ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ డిస్కౌంట్‌ ఐడియా సూపర్ సక్సెస్ అయిందని, వాహనదారుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రక్రియ మంగళవారం(మార్చి1న) ప్రారంభ‌మైంది. వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ డిస్కౌంట్‌ ఐడియా సూపర్ సక్సెస్ అయిందని, వాహనదారుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్ర‌తి నిమిషానికి 700 పెండింగ్ చ‌లాన్ల‌ను వాహ‌న‌దారులు క్లియ‌ర్ చేస్తున్నారు. ఆన్‌లైన్, ఈ-చ‌లాన్ వెబ్‌సైట్ ద్వారా పెండింగ్ చ‌లాన్ల‌ను క్లియ‌రెన్స్ చేస్తున్నారు. తొలి 8 గంట‌ల్లో 1.77 ల‌క్ష‌ల చ‌లాన్లు చెల్లింపులు చేశారు.

పెండింగ్ ఈ చ‌లాన్ల చెల్లింపుల ద్వారా కేవలం 8 గంటల్లోనే సర్కారువారికి రూ. 1.77 కోట్లు జ‌మ అయ్యాయి. ఈ చలాన్ల వెబ్‌సైట్‌ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ ద్వారా ఈజీగా క్లియరెన్సులు చేసుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు ఈ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపాయి. పేద, మధ్య తరగతి ప్రజలు గత రెండేండ్లుగా కొవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నదని పోలీసులు గుర్తుచేశారు.

CM KCR: PM Modi ఇలాకా వారణాసిలో కేసీఆర్ ప్రచారం! -బీజేపీపై యుద్ధం ముమ్మరం..


కేసీఆర్ సర్కారు ఆదేశాలతో పోలీసు శాఖ న్యాయాధికారులను సంప్రదించిన తర్వాత ఈ- లోక్‌అదాలత్‌ ద్వారా ఉల్లంఘనల దారులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద భారీ రాయితీని ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మార్చి ఒకటి నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ అవకాశం ఉంటుంది. వాహనదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఇక.

మాఫీ ఇలా..
రెండు, మూడు చక్రాల వాహనాలకు – 75%
ఆర్టీసీ డ్రైవర్లకు – 70%
లైట్‌, హెవీ మోటారు వాహనాలకు – 50%
తోపుడు బండ్లకు – 75%
నో మాస్కు కేసులకు – 90%
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Hyderabad Traffic Police, Traffic challans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు