అలర్ట్.. 5 లక్షల మంది రైతులకు రైతు బంధు నిలిపివేత.. కారణమిదే..

పలు కారణాల రీత్యా బ్యాంకు ఖాతా నంబరు, వివరాలను ఇవ్వని 5 లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లలోకి రైతు బంధు డబ్బులను జమ చేయడం కుదరదని తెలంగాణ వ్యవసాయ శాఖ తేల్చిచెప్పింది.

news18-telugu
Updated: June 29, 2020, 12:07 PM IST
అలర్ట్.. 5 లక్షల మంది రైతులకు రైతు బంధు నిలిపివేత.. కారణమిదే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు పంటల సాగు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రతి సీజనుకు అందిస్తోంది. అందులో భాగంగా వానాకాలం సీజనుకు సంబంధించి ఇప్పటికే లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. అయితే దాదాపు 5 లక్షల మంది రైతులకు మాత్రం రైతు బంధు పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించలేదు. దీనికి కారణం లేకపోలేదు. పలు కారణాల రీత్యా బ్యాంకు ఖాతా నంబరు, వివరాలను ఇవ్వని 5 లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లలోకి రైతు బంధు డబ్బులను జమ చేయడం కుదరదని తెలంగాణ వ్యవసాయ శాఖ తేల్చిచెప్పింది.

దీనికితోడు మరో 26 వేల మంది ఆరు నెలల పాటు ఏలాంటి బ్యాంకు లావాదేవీలను నిర్వహించలేదు. దీంతో వారి ఖాతాల్లోనూ రైతు బంధు డబ్బులు వేయలేదు. ఆరు నెలల పాటు బ్యాంకు ఖాతా ద్వారా ఏలాంటి లావాదేవీలు చేయకపోవడంతో ఆ ఖాతాలు క్లోజ్ అయినట్టు చూపుతుంది. దీంతో ఆ ఖాతాలకు సంబంధించిన రైతు బంధు సొమ్మును తిరిగి వ్యవసాయ శాఖ ఖాతాకు పంపారు. మరోవైపు కొందరు యాజమానులు వారి స్వస్థలంలో కాకుండా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, విదేశాల్లో సెటిల్ కావడంతో వారిని సంప్రదించేందుకు ఫోన్ నంబర్లు అందుబాటులో లేకుండా పోయాయాని అధికారులు చెబుతున్నారు.

కాగా ఫోన్ నంబర్, వివరాలు తప్పుగా ఉన్న రైతుల ఇళ్లకు వెళ్లి వారి ఖాతాను పనిచేసేలా చేసుకోవాలని, లేనిపక్షంలో కొత్త ఖాతాలు తెరిచి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించింది.
First published: June 29, 2020, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading