DISCOMS PROPOSE POWER TARIFF HIKE BY 50 PAISE PER UNIT VRY
Electricity bills hike : విద్యుత్ చార్జీల పెంపుకు రంగం సిద్దం.. యూనిట్‌కు ఎంతంటే...?
ప్రతీకాత్మకచిత్రం
Electricity bills hike : విద్యుత్ చార్జీల పెంపుకు రంగం సిద్దమైంది.. గృహ వినియోగానికి యూనిట్‌కు 50 పైసలు,హెచ్‌టి వినియోగదారులకు రుపాయి చొప్పున పెంచాలని ప్రతిపాదనలు పంపారు.
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుకు రంగం సిద్దమైంది. త్వరలో పెరగనున్న విద్యుత్ చార్జీలు అమలు కానున్నట్టు సమాచారం. కాగా విద్యుత్ చార్జీల పెంపు పై డిస్కమ్‌లు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపారు. అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ( ఏఆర్ఆర్ ) టారిఫ్‌ను తెలంగాణ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్‌కు ( ఈఆర్సీ) కి ప్రతిపాదనలు పంపాయి. ప్రతిపాదనల్లో భాగంగా గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. (హెచ్ టి ) హై టెన్షన్ వినియోగదారులకు గాను ఒక రూపాయి చొప్పున పెంచాలని కోరాయి. ఎల్టీ పెంపు వల్ల సమారు 2110 కోట్ల అదనపు ఆదాయం రానున్నట్టు తెలిపారు. ఇక హెచ్‌టి వినియోగదారుల పెంపు ద్వారా 4721 కోట్లు ఆదాయం రానున్నట్టు పేర్కోన్నారు. మొత్తంగా ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
కాగా తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఉచిత పవర్ ఇవ్వడంతో పాటు చేనేత రంగాలకు సబ్సిడితో కూడిన విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఇటివల సెలున్స్, లాండ్రీలకు కూడా ఉచిత పవర్ ఇవ్వడంతో పాటు పౌల్ట్రి ఫామ్స్ ఇతర రంగాలకు ఇచ్చే సబ్సిడిలు కొనసాగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.