(S.Rafi,News18,Mahabubnagar)
పరిస్థితులు కలిసి రాకపోతే ఓడలు బండ్ల అవుతాయంటే ఇదేనేమో. ఉన్న భూమి సాగు చేసుకుంటూ ఏ లోటు లేకుండా బతికిన కుటుంబం ఇది. కానీ విధి పగ బడితే.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సొంత ఊరిలో నిలువనీడ సెంటు భూమి కూడా కరువైంది. కనీసం అంత్యక్రియలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది డిండి ఎత్తిపోతల పథకం (dindi scheme) డి ఎల్ ఐ నిర్వాసితుల కుటుంబం ఎదుర్కొన్న దయనీయ స్థితి. నాగర్ కర్నూల్ జిల్లా(nagar karnool district) వంగూరు మండలం డిండిచింతపల్లి కి చెందిన తమ్ముల బుచ్చిరెడ్డి రజిత అమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. గ్రామంలో లో ఉన్న ఇల్లు పదేళ్ల కిందట కూలిపోయింది. ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో బుచ్చిరెడ్డి కన్నుమూశారు.
ఆరేళ్ల కిందట డిండి ఎత్తిపోతల పథకం డి ఎల్ ఐ కాలువ నిర్మాణానికి ఉన్న ఐదు ఎకరాల భూమిని తీసుకున్నారు. అప్పటి నుంచి పైసా పరిహారం రాలేదు. విధిలేని పరిస్థితిలో రజితమ్మ హైదరాబాద్ లో పనులు చేస్తూ కుమార్తె ప్రగతి, కుమారుడి ప్రశాంత్ రెడ్డి లను చదివించింది. కుమార్తెకు మూడేళ్ల కిందట వివాహం చేసింది. కుమారుడు చిన్న జీతానికి పని చేస్తున్నాడు . రజితమ్మను కూడా అనారోగ్యం వెంటాడింది. రాత్రి ఆమె తుది శ్వాస విడిచింది. రజిత భౌతికకాయం తో గ్రామానికి వచ్చిన పిల్లలకు ఎక్కడికి వెళ్లాలో అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలో దిక్కుతోచని స్థితి. ఇల్లు లేదు.. పొలం లేదు.
చివరికి డి ఎల్ ఐ కాలువ వద్దకు వెళ్ళగా బంధువులు టెంటు వేసి లీడర్ ఏర్పాటు చేయగా అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి తన సోదరుడు బంధువులను పట్టుకొని విలపించిన తీరు అందరినీ కంట నీరు పెట్టించింది. ఎకరాకు రూ 5.50 లక్షల పరిహారం ఇస్తామని భూమి తీసుకుని ఒప్పందాలు చేసుకుని డి ఎల్ ఐ కాలువ నిర్వహించారు. ఆరేళ్ల అయిన పైసా ఇవ్వలేదు. పరిహారం ఇస్తే కనీసం ఊర్లో ఇల్లు కట్టుకునే వాళ్ళం.
భూమి ఉన్నా సాగు చేసుకుని బతికే వాళ్ళం. తల్లి అంత్యక్రియలు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ప్రగతి కన్నీరుమున్నీరైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్న చెల్లెలు కు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఇది అతడి ఒక్కడి పరిస్థితే కాదు.. ఇలా చాలామందికి పరిహారం అందక ఇబ్బందులకు ఎదుర్కొంన్నారు. వాళ్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar