ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ఐఏ (NIA) అధికారులు ఆదివారం నాడు సోదాలు చేయడం సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అనుమానాలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. విదేశాల నుండి నగదు బదిలీ, బ్యాంకు ఖాతాల లావాదేవీలు జరిగినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఆరా తీస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, నంద్యాల జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) అధికారుల తనిఖీలు చేశారు. ఏకకాలంలో ఎన్.ఐ.ఏ అధికారుల బృందం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ లో నిర్వహించిన సోదాలో లభించిన ఆధారాలతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. కాగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆదిలాబాద్ లో తలదాచుకున్నట్లు తెలుసుకున్న పక్కా సమాచారంతో ఎన్ఐఏ అధికారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కాలనీలోని అబూబాకర్ మజీద్ సమీపంలో గత కొంత కాలంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్న అనుమానిత వ్యక్తిని అధికారులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే నిజామాబాద్ కు చెందిన సదరు వ్యక్తి కొంతకాలంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అద్దెకు తీసుకొని ఉంటున్నట్లుగా ఎన్.ఐ.ఏ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఆయన నుండి ల్యాబ్ ట్యాప్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కోర్టు అనుమతితో జిల్లా జైలులో ఎన్.ఐ.ఏ అధికారులు ఇరువురు ఖైదీలను విచారించినట్లు తెలిసింది. ఈ విచారణలో పలు కీలకాంశాలు లభించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మదీనా కాలనీలోనూ పలు ఇళ్లల్లో ఎన్.ఐ.ఏ అధికారులు ఉదయం నుండే సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణ కార్యకలాపాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికి ఒకేసారి ఇటు ఆదిలాబాద్, అటు నిర్మల్ జిల్లాల్లో ఎన్.ఐ.ఏ ఇలా సోదాలు నిర్వహించడం చర్చణీయాంశమే కాకుండా కలకలం కూడా సృష్టించింది.
Terror Crackdown on PFI:
NIA conducts raids across 40 locations on suspected PFI activists in AP, Telangana Arrested Muslims: Abdul Kader, Sheikh Sahadulla, Md Imran, Md Abdul Mobin NIA seized incriminating materials incl digital devices, documents, 2 daggers & Rs 831,500 cash — Mayank Jindal (@MJ_007Club) September 18, 2022
ఇక మొత్తం ఏపీ, తెలంగాణల్లో అనుమానిత పీఎఫ్‌ఐ కార్యకర్తలపై 40 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. అరెస్టయిన వారిలో అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, ఎండి ఇమ్రాన్, ఎండి అబ్దుల్ మోబిన్ ఉన్నారు. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, 2 బాకులు & రూ. 831,500 నగదుతో సహా నేరారోపణలను NIA స్వాధీనం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.