Dharani Portal: పారదర్శకంగా, భద్రంగా ధరణి.. అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్

Dharani Portal: తహసీల్దార్లు రేపటి కల్లా కనీసం పది లావాదేవీలను ప్రయోగాత్మకంగా పూర్తి చేయాలని సోమేశ్ కుమార్ సూచించారు.

news18-telugu
Updated: October 17, 2020, 5:41 PM IST
Dharani Portal: పారదర్శకంగా, భద్రంగా ధరణి.. అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కాబోయే ధరణి పోర్టల్ పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.. ధరణి పోర్టల్‌ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించి, అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. శనివారం పోర్టల్‌ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తహసీల్దార్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్లు కూడా పాల్గొన్నారు. ధరణి పోర్టల్‌ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తారని సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 570 మండలాల్లోని తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా పని చేస్తారని, సబ్ రిజిస్ట్రార్ అధికారులు 142 ప్రదేశాల నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారని వెల్లడించారు. తహసీల్దార్లు రేపటి కల్లా కనీసం పది లావాదేవీలను ప్రయోగాత్మకంగా పూర్తి చేయాలని సోమేశ్ కుమార్ సూచించారు.

Cm kcr, Somesh kumar, telangana new cs somesh kumar, telangana new cs, sk joshi retire, సీఎం కేసీఆర్, సోమేశ్ కుమార్, తెలంగాణ కొత్త సీఎస్ సోమేశ్ కుమార్, తెలంగాణ కొత్త సీఎస్
సోమేశ్ కుమార్(ఫైల్ ఫోటో)


ధరణి సేవలకు అంతరాయం కలుగకుండా చూసేందుకు డిస్కమ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టీఎస్‌టీఎస్‌ ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఐజీ శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్, ఫైనాన్స్ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, పీఆర్‌ఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు, ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 17, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading