Dharani Portal: తహశీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలు..ఎప్పటి నుంచంటే..

ధరణి పోర్టల్‌ నిర్వహణకు వీలుగా తహశీల్దార్‌ కార్యాలయాల్లో సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.

news18-telugu
Updated: September 24, 2020, 7:04 AM IST
Dharani Portal: తహశీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలు..ఎప్పటి నుంచంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన, బిల్లలుకు ఆమోదం తర్వాత.. ఈ చట్టం ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ధరణి పోర్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఏకీకృత డిజిటల్‌ సేవల పోర్టల్‌ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో తహశీల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఇప్పటికే ఒక సంస్థకు అప్పగించారు.

ధరణి పోర్టల్‌ నిర్వహణకు వీలుగా తహశీల్దార్‌ కార్యాలయాల్లో సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహించారు సీఎస్. ధరణి పోర్టల్‌తో పాటు రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలు, వీధి వ్యాపారుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ ‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నమోదు కాని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోర్టల్‌ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు.

మరోవైపు రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటికీ వారికి ఇతర శాఖలకు బదిలీ చేయలేదు. ఆప్షన్లు ఇచ్చిన తర్వాతే వేరొక శాఖ బాధ్యతలు అప్పగించనున్నారు. దానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లో బాధ్యతలు అప్పగించే వరకు... భూసంబంధ వ్యవహారాల్లో కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, సమాచార సేకరణకు వీఆర్వోల సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అప్పటివరకు రెవెన్యూశాఖ తరఫునే వారి వేతనాలను అందించాలని తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading