Dharani Portal: ధరణి పోర్టల్ ప్రారంభం వాయిదా.. మళ్లీ ఆ రోజున

Dharani Portal: ధరణి పోర్టల్ ప్రారంభం వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: October 23, 2020, 6:29 PM IST
Dharani Portal: ధరణి పోర్టల్ ప్రారంభం వాయిదా.. మళ్లీ ఆ రోజున
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరా రోజు ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ దసరా నాడు ధరణి పోర్టల్ ప్రారంభిస్తారని.. ఆ రోజు నుంచి తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని వెల్లడించింది. అయితే తాజాగా ధరణి పోర్టల్ ప్రారంభం వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే పోర్టల్ ప్రారంభం వాయిదా పడినట్టు తెలుస్తోంది.

ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి రెవెన్యూ సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తోంది ప్రభుత్వం. దీనిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

ధరణి పోర్టల్‌ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువలను ఖరారు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. తహశీల్దారు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారికి డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి, తయారు చేయడానికి వీలుగా డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి, వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ధరణి పోర్టల్‌లో చేర్చాలని ఆదేశించారు. తర్వాత జరిగే మార్పులు, చేర్పులు వెనువెంటనే నమోదు చేయడం జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 23, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading