హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maha Shivratri లీల: గ‌ర్భ‌గుడిలో నాగుపాము ప్ర‌త్య‌క్షం.. పూజ‌లు చేసిన భ‌క్తులు

Maha Shivratri లీల: గ‌ర్భ‌గుడిలో నాగుపాము ప్ర‌త్య‌క్షం.. పూజ‌లు చేసిన భ‌క్తులు

పరమ శివుడి కంఠాభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. పర్వదినం రోజునే ఇలా జరగడంతో దీనిని శివలీలగా భక్తులు భావించారు. క్యూలైన్ల ద్వారా నాగేంద్రుని దర్శనం చేసుకున్నారు.

  (Katta Lenin, News 18, Adilaba)

  మహా శివరాత్రి నాడు అరుదైన ఘటన చోటుచేసుకుంది. పరమ శివుడి కంఠాభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. పర్వదినం రోజునే ఇలా జరగడంతో దీనిని శివలీలగా భక్తులు భావించారు. క్యూలైన్ల ద్వారా నాగేంద్రుని దర్శనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వ‌ర‌స్వామి ఆలయంలో చోటుచేసుకుందీ ఘటన. శివాలయం గర్భగుడిలో పాము కనిపంచిన వీడియో వైరలైంది.

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో నిర్మ‌ల్ జిల్లా ద‌స్తురాబాద్ మండ‌లం గొడిశార్ల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నాగుపాము ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో భ‌క్తులు ఆ నాగుపాముకు పూజ‌లు చేశారు.

  CM KCR వ్యూహం బెడిసికొట్టిందా? -కేజ్రీవాల్‌తో భేటీ లేనట్టే? -ఢిల్లీ పర్యటన దానికోసం కాదట!

  ఆల‌యంలోని గ‌ర్భ‌గుడిలోకి నాగు పాము ప్ర‌వేశించింద‌ని భ‌క్తులకు తెలియ‌డంతో పెద్ద ఎత్తున అక్క‌డికి త‌ర‌లివ‌చ్చారు. త‌మ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు. అయితే నాగుపామును చూసేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లిరావ‌డంతో.. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

  Collage Girl: టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోమి.. షాకింగ్ ఘటన

  ఈ సంద‌ర్భంగా ఆల‌య పూజారి ల‌క్ష్మ‌ణ్ స్వామి మాట్లాడుతూ.. గ‌త ఐదేండ్ల నుంచి శివ‌రాత్రి ప‌ర్వ‌దినం నాడు ఆల‌య గ‌ర్భగుడిలోకి నాగుపాము వ‌చ్చి పూజ‌లు అందుకుంటుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భ‌క్తులు ఆ పాముకు ప్ర‌త్యేక పూజ‌లు చేసి త‌మ భ‌క్తిని చాటుకుంటున్నార‌ని చెప్పారు.

  First published:

  Tags: Maha Shivaratri 2022, Maha Shivratri, Nirmal, Viral Video

  ఉత్తమ కథలు