Home /News /telangana /

DEVOTEES ARE FLOCKING TO TELANGANA ANNAVARAM GOODEM GUTTA IN MANCHIRYALA DISTRICT ADB VB

Telangana Temple: తెలంగాణ అన్నవరానికి కార్తీకశోభ.. కిక్కిరిసిన ఆలయం.. ఎక్కడంటే..

ఆలయంలో భక్తుల సందడి

ఆలయంలో భక్తుల సందడి

Telangana Temple: తెలంగాణా రాష్ట్రంలోనే మరో అన్నవరంగా పేరుగాంచిన మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం గూడెం గుట్ట మీద కొలువున్న రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో గుడెం గుట్ట కిక్కిరిపోయింది.

ఇంకా చదవండి ...
  (K.Lenin,News18,Adilabad)

  తెలంగాణ రాష్ట్రంలోనే మరో అన్నవరంగా పేరుగాంచిన మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం గూడెం గుట్ట మీద కొలువున్న రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో గుడెం గుట్ట కిక్కిరిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు సమీపంలోని పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి వచ్చి ఆలయంలోని రమా సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకలు, అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు.

  Lovers In RTC Bus: అతడికి 28 ఏళ్లు.. బాలికకు 14 ఏళ్లు.. ఆటోలో ప్రేమించుకున్నారు.. బస్సులో ఇలా చేశారు..


  ఇదిలా ఉంటే గూడెంలోని ఈ సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది కలిగిఉంది. రత్నాద్రి కొండగా పిలిచే ఈ గూడెం గుట్టపై 1964 ప్రాంతంలో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్లస్వామి అనే భక్తుడికి సత్యనారాయణ స్వామి కలలో సాక్షాత్కరించడంతో రాళ్ళు రప్పలు, ముళ్ళ పొదలను దాటుకుంటూ వెళ్ళి కొండపై కి వెళ్ళడంతో స్వామివారి విగ్రహాలు లభించాయని, వాటికి పవిత్ర గోదావరి జలాలతో అభిషేకం చేశాడని, అప్పుడే ఇక్కడ ఆలయం నిర్మించాలని సంకల్పించి గుడి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు కథలుగా చెబుతుంటారు. అప్పటి నుండి ఈ ఆలయం దినదినాభివృద్ది చెందుతూ వస్తోంది.

  OMG: ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. ఓ ఘటనకు బాధ్యుడిగా మారాడు.. దీంతో తన కాలేజీకి వెళ్లి ఇలా చేశాడు..


  ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో గోదావర నదీ సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుత మంచిర్యాల జగిత్యాల జిల్లాల సరిహద్దులో పవిత్ర గోదావరి నదీ సమీపంలోకి వస్తోంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయానికి భారీ సంఖ్యలో తరలివస్తారు. ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసి, ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా చేయడం ద్వారా తమ కష్టాలు తొలిగిపోయి కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సహజ సిద్దమైన ప్రకృతి రమణీయతల నడుమ ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

  Affair: పుట్టింటికి వెళ్లిన భార్య.. వెంటనే వస్తానని చెప్పి తిరిగి రాలేదు..; ముగ్గురు ప్రియులతో కలిసి..

  ఈ గుట్టను ఆనుకొని ఉన్న మరో గుట్టపై అయ్యప్పస్వామి ఆలయం ఉంది. దీన్నిమరో శబరిమలైగా కూడా భక్తులు అభివర్ణిస్తుంటారు. ప్రధాన రహదారికి ఆనుకొని సాయిబాబా ఆలయం కూడా ఉన్నది. గ్రామ చివరలో సద్గురు సదానంద హరి ఆలయం, గోదావరి తీరంలో మహాలింగేశ్వరస్వామి, శనీశ్వరుడు, గంగమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన జాతరకు భక్తులు పోటెత్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ అనూష తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లు, అదనపు టికెట్ కౌంటర్లు, లడ్డూ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల ఏసిపి అఖిల్ మహాజన్ సూచన మేరకు గూడెంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Hindu Temples

  తదుపరి వార్తలు