Nirmal : సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఉప సర్పంచ్.. ! కారణం ఇదే... !

Nirmal : సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఉప సర్పంచ్.. ! కారణం ఇదే... !

Nirmal : నిర్మల్ జిల్లాలో ఓ మహిళా ఉప సర్పంచ్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేసింది. దీంతో నిధుల దుర్వినియోగం పై విచారణ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ, తోపులాట జరగడంతో ఆవేశంతో చెప్పు తీసి కొట్టింది.

  • Share this:
    వారు ఇరువురు ప్రజా ప్రతినిధులు. గ్రామంలో అందరికి మంచిచెడు చెబుతూ ఆదర్శంగా నిలవాల్సిన స్థానంలో ఉన్నారు. కానీ వివేకం కోల్పోయి నవ్వులపాలయ్యే పనికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ (nirmal )జిల్లా భైంసా మండలంలోని మహాగావ్ లో చోటుచేసుకుంది. మహాగామ్ గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మహాగామ్ గ్రామ సర్పంచ్ (sarpanach) అప్పల రాకేష్ పై ఉప సర్పంచ్ శారద దుర్భాషలాడుతూ చెప్పుతో దాడి చేసింది.

    పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఉప సర్పంచ్ శారద జిల్లా కలెక్టర్ కు(collector) ఫిర్యాదు చేసింది. అయితే నిధుల దుర్వినియోగం పై డిఎల్పీఓ శివరామ కృష్ణ విచారణ( enquiry) చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సర్పంచ్ నిధులు (money) డ్రా చేసిన చెక్కులను అధికారులు పరిశీలించారు. వాటిపై ఉప సర్పంచ్ సంతకాలు కూడా ఉండడంతో అధికారులు ప్రశ్నించారు. తాను చెక్కులపై సంతకాలు పెట్టలేదని.. తన సంతకాలను ఫోర్జరీ చేశారని ఉప సర్పంచ్ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఉప సర్పంచ్ శారద సర్పంచ్‌పై దాడికి దిగారు.

    ఇది చదవండి : అక్క కేసులో విచారణకు వెళ్లి.. చెల్లెలితో సంబంధం.. పెట్టుకున్న కానిస్టేబుల్


    ఇక అక్కడ పరిస్థితిని చిత్రీకరుస్తున్న పంచాయితీ సెక్రటరీ ప్రత్యూష పై కూడా దాడి జరిగింది. సర్పంచ్ ,ఉప సర్పంచ్ వర్గీయుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

     ఇది చదవండి : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !

    Published by:yveerash yveerash
    First published: