హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka Byelection Result: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Dubbaka Byelection Result: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాకలో ఉప ఎన్నిక విజేతను తాము అధికారికంగా ప్రకటించలేదని డిప్యూటీ సీఈవో తెలిపారు. కొన్ని చానెళ్లలో బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా వస్తున్న వార్త సాధికారికం కాదని అన్నారు

  దుబ్బాకలో ఉప ఎన్నిక విజేతను తాము అధికారికంగా ప్రకటించలేదని డిప్యూటీ సీఈవో తెలిపారు. కొన్ని చానెళ్లలో బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా వస్తున్న వార్త సాధికారికం కాదని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ సమయంలో మొత్తం 4 ఈవీఎంలు మొరాయించాయని.. వాటిలో రెండు ఈవీఎంలు బటన్ నొక్కినా తెరుచుకోవడం లేదని అన్నారు. మరో రెండింటిలో మాక్ పోల్ ఓట్లు డిలీట్ చేయలేదని వెల్లడించారు. ఆ నాలుగు ఈవీఎంల వీవీపాట్‌లను లెక్కించిన తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. 23 రౌండ్ల లెక్కింపు పూర్తయిందని.. ప్రస్తుతం వీవీపాట్లలోని ఓట్లను లెక్కిస్తున్నామని తెలిపారు. మరికాసేపట్లో దుబ్బాక ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

  ఇక, చివరి రౌండ్ వరకు దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. 23 మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్ల అధిక్యంలో ఉండటంతో.. ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. దుబ్బాకలో రఘునందన్‌రావు విజయం తెలంగాణలో ధర్మ స్థాపనకు, సుపరిపాలనకు నాంది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన దుబ్బాక ప్రజలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో గెలుపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు.

  మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల ఓటమిని టీఆర్‌ఎస్ శ్రేణులు అంగీకరించాయి. దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్ ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని అన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Dubbaka By Elections 2020