తాత, తండ్రి, కుమార్తె మృతి... మూడు తరాలను బలితీసుకున్న డెంగీ

రాజు మరణించిన కొద్ది రోజులకే అతని కూతురు నాలుగేళ్ల శ్రీవర్షిణి కూడా డెంగీ బారిన పడింది. దీపావళి రోజే ఆ చిన్నారి కూడా కానారానిలోకాలకు వెళ్లిపోయింది.

news18-telugu
Updated: October 29, 2019, 10:59 AM IST
తాత, తండ్రి, కుమార్తె మృతి... మూడు తరాలను బలితీసుకున్న డెంగీ
రాజు మరణించిన కొద్ది రోజులకే అతని కూతురు నాలుగేళ్ల శ్రీవర్షిణి కూడా డెంగీ బారిన పడింది. దీపావళి రోజే ఆ చిన్నారి కూడా కానారానిలోకాలకు వెళ్లిపోయింది.
  • Share this:
డెంగీ కారణంగా ఓ ఇంట్లో వరుస మరణాలు చోటు చేసుకున్నాయి. మూడుతరాలకు చెందినవారిని డెంగీ మహమ్మారి బిలీతీసుకుంది. కేవలం 15 రోజుల్లనే ఈ దారుణ ఘటన చోటు చేసకుంది. దీపావళి పండగ పూట ఆ ఇంట మరో దీపం ఆరిపోవడం... కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌కు చెందిన గుడిమల్ల రాజుగట్టు వయసు 30 ఏళ్లు. ప్రైవేట పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా డెంగీ బారిన పడిన రాజు... స్థాని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే రాజు పరిస్థితి విషమించింది. దీంతో కటుుంబసభ్యులు అతడ్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజు ఈనెల 16న మృతిచెందాడు.

రాజు చనిపోయిన ఐదు రోజులకే.. అతని తండ్రి 70 ఏళ్ల లింగయ్య సైతం డెంగీ బారిన పడి చనిపోయాడు. ఇద్దరి మరణాలతో ఆ కుటుంబం కుమిలిపోయింది. ఆ బాధలో ఉండగానే ఆ ఇంట మరో చావు కబురు నింపాడు భగవంతుడు. రాజు కూతురు నాలుగేళ్ల శ్రీవర్షిణి కూడా డెంగీ బారిన పడింది. దీపావళి రోజే ఆ చిన్నారి కూడా కానారానిలోకాలకు వెళ్లిపోయింది. దీంతో నిండు గర్భిణి అయిన రాజు భార్య సోనికి కడుపుకోత, మరోవైపు భర్త పోయిన దుఖంతో తల్లడిల్లుతుంది. సోనీ కూడా డెంగీ బారిన పడింది. దీంతో ఆ కుటుంబం కనీసం 9నెలల గర్భిణి అయిన సోనీ ప్రాణాల్ని అయినా కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి డెంగీ ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల ప్రజలు కోరుకుంటున్నారు.ఇవికూడా చదవండి:


కృష్ణా జిల్లాలో కూలిన స్కూల్ పైకప్పు

First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...