ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) రిమాండ్ రిపోర్టులో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేరును ఈడీ (Enforcement Directorate) చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ కేసులో కవిత (MLC Kavita) పాత్ర ఉందంటూ మీడియా లీకులకే పరిమితం అయ్యాయి. కానీ మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత (MLC Kavita) పేరును చేర్చింది. ఈ క్రమంలో మీడియా ముందుకు కవిత (MLC Kavita) వచ్చారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే మోడీ కంటే ఈడీ (Enforcement Directorate) ముందుగా వచ్చింది. నా మీద, మా ఎమ్మెల్యేలపై, మంత్రులపై కేసులు పెడుతున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుంది. బిజెపి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. కేసులు పెట్టుకోండి..అరెస్టులు చేసుకోండి..జైల్లో పెట్టుకోండి అని కవిత (MLC Kavita) సవాల్ విసిరారు. ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని బీజేపీ పడగొట్టింది. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా..ఈ పంథా మార్చుకోవాలన్నారు. ఈడీ (Enforcement Directorate), సీబీఐ (Central Burew Of Investigation)ను ఎదుర్కొంటాం. జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధం అని కవిత (MLC Kavita) పేర్కొన్నారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని కవిత (MLC Kavita) అన్నారు. ప్రజలు మనతో ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదన్నారు.
రిపోర్ట్ లో కవిత రోల్ ఏంటి?
ఈ రిపోర్టులో కవిత(Kalvakuntla Kavitha) పేరు తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్ చెల్లించినట్టు పేర్కొన్న ఈడీ.. ఈ మొత్తాన్ని సమకూర్చిన వారిలో కవిత పేరును కూడా చేర్చింది. సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్ నాయర్‌కు చేర్చినట్టు వెల్లడించింది. ఆప్ నేతల తరపున విజయ్ నాయర్ ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఈడీ ప్రస్తావించింది. పది సెల్ఫోన్లను కూడా కవిత డ్యామేజ్ చేసినట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం 36 మందికి చెందిన 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.
కీలకం కానున్న అమిత్ అరోరా..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అధికారులు గుర్గావ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. ఈక్రమంలో అదుపులోకి అమిత్ అరోరాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. ఈ లిస్ట్ లో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీగా ఉన్న లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం ఇప్పుడు సంచలనానికి దారి తీసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Kavitha, Telangana, Telangana News