Home /News /telangana /

DEGREE SEMISTER EXAM PAPER LEAK BEFORE THE EXAMS OF SHATAVAHAN UNIVERSITY VRY KNR

Karimanagar : హైటెక్ పద్దతిలో డిగ్రీ పరీక్షలు.. పేపర్ లీక్... చూసి రాసేందుకు రెఢీ విద్యార్థులు

Karimanagar

Karimanagar

Karimanagar : డిగ్రీ పరీక్షలు విద్యార్థులకు కఠినంగా మారాయా..? పరీక్షలు రాయలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారా..అందుకే హైటెక్ పద్దతిలో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి, మరీ... చూసి, పరీక్షలు రాస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది..ఇందుకు ఉదహరణగా శాతవాహన యూనివర్శిటి పరిధిలో పరీక్ష పేపరు విద్యార్థుల మొబైల్‌ఫోన్‌లో ప్రత్యక్షమైంది..

ఇంకా చదవండి ...
    కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు.కారస్పాండెంట్. శ్రీనివాస్. పి.

    ఆదునిక టెక్నాలజీ ఉపయోగించుకుని కొంతమంది విద్యార్ధులు తప్పుడు మార్గంలోకి వస్తున్నారు..కనీసం డిగ్రీ పరీక్షలను కూడా సరిగా రాయలేనివారిగా మిగిలిపోతున్నారు..ఇలా కరీంనగర్ లోని విద్యార్థులు డిగ్రీ ప్రశ్నపత్రాన్ని తమ సెల్‌ఫోన్‌లో చూస్తూ అందుకు సంబంధించిన జవాబులను సైతం చూసి రాసేందుకు సిద్దమై అధ్యాపకులకు పట్టుబడ్డారు.

    వివారాల్లోకి వెళితే..కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో డిగ్రీ 6 , 4 వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యాయి . ఇందులో భాగంగా 6 వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు , 4 వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయి .

    కాగా బుధవారం ఉదయం ఎస్‌ఆర్ఆర్ కళాశాల కేంద్రం వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యో పరీక్ష సమయానికి హాల్లో ఉండాల్సిన విద్యార్థులు సమయం దాటినా.. బయటటే గుమికూడారు..దీంతో అనుమానం వచ్చిన ఎస్‌ఆర్ఆర్ అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి చూశారు..దీంతో వారికి షాక్ తగిలింది..విద్యార్థులు..తమ సెల్ ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతుండడం కనిపించింది . కాగా సెల్‌ఫోన్లో ప్రశ్నపత్రం ముందే లీక్ అయినట్టు పసిగట్టారు.. దీంతో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది, వారి వద్ద సెల్ ఫోన్‌లను తీసుకుని ఆ తర్వాత యూనివర్శిటి ఉన్నతాధికారుకు సమాచారమందించారు .

    శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 9 సెల్‌ఫోన్లు సీజ్ చేసి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షల విభాగం అధికారులకు అప్పగించారు . ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగప్రసాద్, వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ దృష్టికి తీసుకెళ్లగా నలుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది . కమిటి నివేదిక వచ్చిన తర్వాత భాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Degree exams, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు