జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించే దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాల్లో మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సత్తా చాటింది. ఈ ఏడాది తెలంగాణకు 12 అవార్డుల లభించాయి. కోరుట్ల, ధర్మారం మండల పరిషత్తులతోపాటు ఎనిమిది పంచాయతీలు మరో తొమ్మిది అవార్డులను దక్కించుకున్నాయి. అయితే వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 7 అవార్డులను ఖతాలో వేసుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఉమ్మడి జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండల పరిషత్‌లతో పాటు పర్లపల్లి, హరిదాస్ నగర్, మోహినీకుంట, సుందిళ్ల పంచాయతీలకుఅవార్డులు వచ్చాయి. అయితే పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల పంచాయతీకి రెండు క్యాటగిరిల్లో అవార్డులు దక్కడం విశేషం. ఇక, గతంలో కూడా జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్మార్ట్ సిటీ, మరియు ఐటీ టవర్, మానేరు రివర్ ఫ్రంట్ తో పాటు కెసిఆర్ ఐలాండ్, లాంటివి కరీంనగర్ కు సుందరికరణ నగరంగా అభివృద్ధి గాంచింది.
ఇందులో నే భాగంగా రెండు అవార్డులతో మెరిసిన సుందిళ్ల..
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామపంచాయతీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాల్లో రెండు విభాగాల్లో విజేతగా నిలబడింది. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారంతో పాటుగా.. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అమలు అవార్డుకూడా దక్కించుకుంది.
సుందిల్ల గ్రామం
అత్యధిక గ్రామ సభలు నిర్వహించి గ్రామపాలన పారదర్శకంగా జరుపుతున్నందుకు, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, గ్రామాభివృద్ధికి ప్రతినెలా యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేసినందుకు ఈ అవార్డులు దక్కాయి.
సుందిల్ల గ్రామం
ఇక, సుందిల్ల గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.2.17కోట్లతో గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల్ని కూడా ఏర్పాట్లు చేశామని గ్రామ సర్పంచి దాసరి లక్ష్మీ రాజలింగు చెప్పారు.
సుందిల్ల గ్రామం
రెండు పురస్కారాలు రావడం గ్రామానికి గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని సర్పంచి అన్నారు. గ్రామ అభివృద్దికి సహకరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
-(పి శ్రీనివాస్, న్యూస్ 18 కరీంనగర్ కరస్పాడెంట్)
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.