ఆ అంశంపై రేపటిలోగా తేల్చండి.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

కోవిడ్ బులెటిన్‌లను ఏ విధంగా విడుదల చేస్తున్నారో...కూల్చివేతలపై కూడా బులిటెన్ విడుదల చేయొచ్చు కదా అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

news18-telugu
Updated: July 23, 2020, 2:34 PM IST
ఆ అంశంపై రేపటిలోగా తేల్చండి.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
తెలంగాణ హైకోర్టు
  • Share this:
సచివాలయం భవనాల కూల్చివేత పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుతించలేమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. సచివాలయం కూల్చివేతల్లో మీడియాకు అనుమతిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కూల్చివేత వద్ద మీడియాను ఎందుకు అనుమతించరో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్‌లో పని చేసేవారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరోవైపు కూల్చివేతల్లో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ బులెటిన్‌లను ఏ విధంగా విడుదల చేస్తున్నారో...కూల్చివేతలపై కూడా బులిటెన్ విడుదల చేయొచ్చు కదా అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

ఈ అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదించి సోమవారం కోర్టుకు వివరాలు చెబుతామని ఏజీ తెలిపారు. మరోవైపు ఇప్పటికే 95శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అయితే ఈ అంశంపై రేపటిలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపకపోతే తామే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు... కేసులో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే కొత్త సచివాలయం నిర్మాణంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. కొత్త సచివాలయం నమూనా మరింత ప్రతిష్టాత్మకంగా ఉండి, రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనల మేరకు సవరించిన సమీకృత సచివాలయ మోడల్‌ను ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్చర్స్ అందజేయనుంది. దీనిపై అధికారులతో చర్చించి... త్వరలో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో కొత్త నమూనాను ఖరారు చేయనున్నారు. అనంతరం సచివాలయ నిర్మాణానికి టెండర్లను పిలవనున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 23, 2020, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading