(కరీంనగర్ జిల్లా. .న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్ పి.)
సంఘటన వివరాల్లోకి వెళ్తే .. మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని ఇనుకుదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ మహిళ ఫిబ్రవరి 4 న అదృశ్యం అయింది . మూగ మహిళ అయిన సదరు బాధితురాలు వంట పని చేసుకుంటూ జీవించేదని .. ఆమెకు పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న యథావిధిగా ఇంటినుండి వెల్లిన ఆమె తిరిగి ఇల్లు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు మరునాడు ఇనుకుదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె గురించి ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు
ఇలా ఫిబ్రవరి 4న కిడ్నాప్‌కు గురైన మహిళ ఆచూకిని తిరిగి కిడ్నాప్ చేసిన దుండగులే మార్చి 9న బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయి కరీంనగర్ ఉందన్న సమాచారం ఇచ్చారు . దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇనుకుదూరు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగానే అక్కడి నుండి ప్రత్యేకంగా ఓ టీం కరీంనగర్ చేరుకుని తీసుకెళ్లారు . అయితే ఇంటికి చేరిన బాధితురాలు మూడు రోజుల తర్వాత తన సోదరుడికి అసలు విషయం చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తనపై అత్యాచారం చేశారని తన సోదరుడికి వివరించింది . ఈ సమాచారం ఆయన పోలీసులకు చేరవేయడంతో అక్కడి పోలీసులు కిడ్నాప్ , రేప్ సెక్షన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు .
దీంతో రెండు రోజుల క్రితం ఇనుకుదూరు పోలీస్ స్టేషన్లో కేసును మార్చిన పోలీసులు పూర్తి స్థాయి విచారణకు రంగంలోకి దిగారు . ఈ మేరకు సీఐ కొండయ్య నేతృత్వంలో పోలీసు బృందం ప్రత్యేకంగా కరీంనగర్ చేరుకుని బాధితురాలిని తీసుకువచ్చి రేప్ జరిగిన ప్రాంతాన్ని గుర్తించేందుకు స్థానిక పోలీసుల సహాయంతో దర్యాప్తు చేశారు. అత్యంత రహస్యంగా ఆరా తీసేందుకు వచ్చిన పోలీసు బృందం నిందితులను గుర్తించే పనిలో పడినట్టు తెలుస్తోంది...
Telangana : పాముకు ఎక్స్‌రే.. ఆ తర్వాత సిమెంట్ పట్టి.. అసలేం జరిగిందంటే...!
అయితే బాధితురాలికి ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి కరీంనగర్‌కు స్థానికులు తీసుకువచ్చారా లేక అక్కడి వారే ఎవరైనా ఇక్కడి సంబంధాలతో ఇలా చేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు నెలరోజుల పాటు ఓ మహిళను బంధించడం ఆమెపై అత్యాచారం చేయడంతోపాటు తిరిగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం పై కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. రేప్ జరిగిన మహిళ ఎందుకు వెంటనే స్పందించలేదనే అంశం పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.