ఊరికి దారేదీ.. ఇక్కడ మృతదేహం తరలించాలన్నా కష్టమే..

మంచంపై ఉంచి మోకాలి లోతు నీటిలో వాగుదాటి గ్రామానికి చేర్చారు. వాగుపై వంతెన కోసం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: September 20, 2019, 10:57 PM IST
ఊరికి దారేదీ.. ఇక్కడ మృతదేహం తరలించాలన్నా కష్టమే..
మంచంపై ఉంచి మోకాలి లోతు నీటిలో వాగుదాటి గ్రామానికి చేర్చారు. వాగుపై వంతెన కోసం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • Share this:
అంతరిక్షంలోకి సునాయాసంగా వెళుతున్న ఈ రోజుల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారు మూల పల్లెలకు వెళ్లాలంటే మాత్రం తిప్పలు తప్పడం లేదు. సరైన రవాణా సౌకర్యం లేక, వాగులపై వంతెనలు లేక అత్యవసర పరిస్థితుల్లో నరక యాతన అనుభవిస్తున్నారు పల్లె ప్రజలు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుబిడి గ్రామస్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. చనిపోయిన బాలిక మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఈ గ్రామంలో సరైన సౌకర్యాలు లేవు. ప్రమాదకరంగా మోకాల్లోతు ప్రవహిస్తున్న వరద నీటిలోనే వెళ్లాల్సి ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో ఓ మంచంపై మృతదేహాన్ని ఉంచి గ్రామానికి తీసుకెళ్లారు స్థానికులు.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని మారుములన ఉన్న పల్లె గుబిడి. ఈ గ్రామం నుంచి బయటకు రావాలంటే వాగు దాటాల్సిందే. అయితె గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్థిని పెందుర్ మౌనిక అనారోగ్యం పాలు కావటంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. కాగా మృతదేహాన్ని గ్రామానికి అంబులెన్స్‌లో తీసుకువచ్చినా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దాటలేక ఒడ్డునే వదిలిపెట్టారు. కరింజి, గుబిడి గ్రామస్థుల సహాకారంతో మృతదేహాన్ని మంచంపై ఉంచి మోకాలి లోతు నీటిలో వాగుదాటి గ్రామానికి చేర్చారు. వాగుపై వంతెన కోసం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading