నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి, పి మహేందర్
ప్రతి మనిషిలో ఏదో ఓ కళ దాగి ఉంటుంది. దానిని గుర్తించి ఆచరణలో పెడితే అద్బుతాలు చేయగలరు. ఎవరు కూడా పుట్టుకతోనే కవులు, కాళాకారులు, ప్రతిభవంతులు కాలేరు. వారి ఆసక్తిని గుర్తించి సాదన చేస్తే ఏదైనా సాధ్యమే. అయితే ఓ విద్యార్ధి కాగితంపై గీసిన రాతలే బొమ్మలుగా మారాయి. తనలో ఉన్న ప్రతిభను గుర్తిన ఉపాధ్యాయుడు ప్రోత్సాహం అందించడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తన ప్రతిభను చాటుకుంటున్నాడు. జాతీయ నాయకులు, క్రీడాకారులు, దేవత చిత్రాలను ఇట్టే వేస్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి విష్టు వర్ధన్ పై ప్రత్యేక కథనం మీకోసం..
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన దేవతి ముత్తేన్న.. రాదా దంపతులకు ఇద్దరు సంతానం. ఓ కొడుకు, కూతురు. కొడుకు విష్ణు వర్థన్ తల్వేద గ్రామంలో ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే విష్ణువర్ధన్ చేతి నుంచి జాలువారిన ఈ బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆర్మూర్ లోని సాంఘీక సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఐదవ తరగతి విష్ణు ను చేర్చారు.. అయితే ఆసంయంలో విష్ణు బోమ్మలు గీయడం చూసి రాయుడు అనే ఆర్ట్ టీచర్ ఇచ్చిన సూచనలతో ఇప్పుడు సొంతంగా చిత్రాలు గీస్తున్నాడు. అలా బొమ్మలు గీయడం ప్రారంభించాడు. ఇప్పుడు తను గీసిన చిత్రలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. విరాట్ కోహ్లీ, దేవత చిత్రాలు ఎంతో అందంగా గీచాడు.
తన చేతినుంచి జాలువారిన చిత్రలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి, పల్లేటూరి చిత్రలు అందరిని ఆకర్శిస్తున్నాయి.
విష్ణు తన కళకు మరింత పదును పెడితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన చిత్రాలు గీయగలడు. నేను నా చిన్ననాటి నుంచి బోమ్మలు గేసివాడిని అని విష్ణు వర్థన్ చెబుతున్నారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, అంబేద్కర్, దేవి మాత ఇలాంటివి చిత్రాలు గీశాను. అయితే నేను ఆర్మూర్ హస్టల్ లో ఆరవ తరగతి చదువుకున్న సమయంలో రాముడు సారు నాకు బోమ్మలు ఏలా గీయాలి అనే విషయాలు చెప్పాడు. అప్పటి నుంచి బోమ్మలు చాలా అందంగా గీస్తున్నాను అన్నారు.. నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రకృతికి సంబంధించిన బొమ్మలు. పేపర్లు పెట్టి తోటి వారికి చూపించడం నాకు ఆనందంగా ఉంటుంది.
రానున్న రోజుల్లో గొప్ప ఆర్టిస్ట్ కావాలని నా గోల్ అంటున్నాడు విష్ణు. ఈ బాబు మంచి మంచి బొమ్మలు గీస్తాడని తల్వేద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాద్యకుడు సాయన్న అంటున్నారు. క్రికెటర్ల ఫోటోలు, జాతీయ నాయకుల ఫోటోలు, దేవతల ఫోటోలు చాలా బాగా గీస్తున్నాడు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే రకంగా ఎన్నో మంచి బొమ్మలు గీయాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.