రగులుతున్న నల్లమల... యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత...

Uranium Mining : నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదని జనసేన పార్టీతోపాటూ, స్వచ్ఛంద సంస్థలు తమ ఆందోళనను ఉద్యమరూపు దాల్చుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 5:34 AM IST
రగులుతున్న నల్లమల... యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత...
జనసేన అధినేత పవన్ కల్యాణ్
Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 5:34 AM IST
Nagar Kurnool : నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతు కొనసాగుతుందని ట్విట్టర్‌లో తెలిపారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా... యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా.. అనేది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోంచించాలని ఆయన కోరారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలకూ ముప్పు తప్పదని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. యురేనియం తవ్వకాలపై త్వరలోనే రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు.
యురేనియం తవ్వకాలకు సంబంధించి లెక్కలు వేసేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులను స్థానికులు, ఉద్యమకారులు అడ్డుకున్నారు. వెనక్కి పంపించేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం 83 చదరపు కిలోమీటర్లను అప్పగించిన అటవీ శాఖ అధికారులు... అడవులు దెబ్బతింటే ఏ విధంగా రక్షిస్తారని, పర్యావరణానికి హాని చేస్తూ, యురేనియం కార్పొరేషన్ అధికారులకు సహకరిస్తున్నారని ఉద్యమ నేతలు మండిపడ్డారు. నాగర్ కర్నూల్‌ జిల్లాలోని తమ ప్రాంతానికి ఏ అధికారి వచ్చినా, ఇలాగే అడ్డుకుంటామని వారు తెలిపారు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...