Home /News /telangana /

DAY BY DAY CORONA CASES ARE INCREASED IN TELANGANA STATE SO INSPECTIONS AND CORONA TESTS HAVE STARTED AT THE TELANGANA BORDER ADB PRV

Telangana borders: సరిహద్దుల్లో గుబులు రేపుతున్న కరోనా..  అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. మహారాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక పరీక్షలు..

పోలీసులకు కరోనా పరీక్షలు

పోలీసులకు కరోనా పరీక్షలు

కరోనా మరోసారి తన ప్రతాపం ప్రదర్శిస్తోంది. నిన్న మొన్నటి వరకు మిన్నకుండిపోయిన కరోనా పండుగ పూట పడగ విప్పుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు, పరీక్షలు ఎక్కువయ్యాయి.

    కరోనా ( Corona) మరోసారి తన ప్రతాపం ప్రదర్శిస్తోంది. నిన్న మొన్నటి వరకు మిన్నకుండిపోయిన కరోనా పండుగ పూట పడగ విప్పి ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా వాసుల్లో గుబులు రేపుతోంది. మొన్నటి వరకు ఒకటి అర కేసులు నమోదవుతుంటే ఇపుడు ఏకంగా వంద దాటేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు సరిహద్దున (Borders) ఉన్న ఆదిలాబాద్ మీదుగా రాకాపోకలు కొనసాగడం స్థానిక ప్రజలను మరింత కలవరపెడుతోంది. అలాగే ఇక్కడి ప్రజలు వివిధ అవసరాల కోసం నిత్యం మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. దీంతో ఏ క్షణంలోనైనా మహరాష్ట్ర నుండి జిల్లాకు వైరస్ వ్యాప్తి చెందవచ్చనే ఆందోళన కనిపిస్తోంది.

    మొన్నటి వరకు సింగిల్ డిజిట్..

    మహారాష్ట్రలోని నాగపూర్, పుణే, ముంబాయి వంటి నగరాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మొన్నటి వరకు సింగిల్ డిజిట్ నమోదైన కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. పోలీసులు, వైద్య సిబ్బంది కూడా కరోనా (Corona) బారిన పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోనూ రోజుకు కేసుల సంఖ్య దాటుతుండగా కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మాత్రం సింగిల్ డిజిట్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు, సిబ్బంది భద్రత, సంక్షేమం లో భాగంగా ఇటీవల మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో అధికారులకు సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. 97 మందికి పరీక్షలు నిర్వహించగా 94 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి మాత్రం పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను శానిటైజ్ చేశారు.

    మహారాష్ట్ర  సరిహద్దు..

    ఇదిలా ఉంటే రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు (Telangana Border) ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ సిక్తా పటాయక్, ఆదిలాబాద్ శాసన సభ్యుడు జోగు మన్న జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులతో సమావేశాని వైరస్ వ్యాప్తిని కట్టిడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర  సరిహద్దు గ్రామమైన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొలారా గ్రామ వద్ద   జాతీయ రహదారిపై జిల్లా  కలెక్టర్ ఆదేశాల మేరకు  మహారాష్ట్ర నుంచి వచ్చే  వాహనాలను  నిలిపి ప్రయాణికులకు థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

    రిమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు..

    అనుమానితులకు కరోనా పరీక్షలు (Corona test) కూడా చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రంగంలోకి దిగి పట్టణంలోని రద్దీ ప్రదేశాల్లో పర్యటించి కరోనా నిబంధనలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన వాణిజ్య కూడళ్ళు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇక ముందు జాగ్రత్త్త చర్యగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల కోసం 550 సింగిల్ లైన్ ఆక్సిజన్ పడకలు, పిల్లల కోసం వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యంతో 160 ఐసియూ పడకలను సిద్దం చేశారు.

    ఇంకా ఆరు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు, వేయి ఎల్.పి.ఎం ప్లాంటు, మరో 500 ఎల్.పి.ఎం ప్లాంట్లు సిద్దంగా చేశారు. చికిత్స కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని కూడా నియమించారు.  అనుమానితులకు రాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం కోసం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా కరోనా కట్టడికి మరోసారి పోలీసు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖలు జట్టుకట్టి ముందుకుసాగుతున్నాయి. అధికారుల  ప్రయత్నాలకు స్థానిక ప్రజల తోడ్పాటు లభిస్తే తప్పక వైరస్ కట్టడి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Corona cases, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు