• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • DAUGHTER IN LAW SUICIDE OF HER MOTHER IN LAW HARASSMENT IN NIZAMABAD VRY

Suicide : బావా నన్ను క్షమించు...! అత్తతో నాకు సరిపోయిందంటూ గర్భిని ఆత్మహత్య...

బావా నన్ను క్షమించు...! అత్తతో నాకు సరిపోయిందంటూ గర్భిని ఆత్మహత్య...

Suicide : పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. ఇంతలో అత్తా కోడళ్ల మధ్య వివాదాలు..దీంతో కలత చెందిన కోడలు తనను క్షమించమంటూ ప్రాణాలు విడిచింది..తన కడుపులో శిశువు ఉందనే కనీస ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకుంది.

  • Share this:
ఇద్దరు బంధువులే అయినా..ప్రేమించుకున్నారు..దీంతో ఇదరు కుటుంబాలు ముందుకు వచ్చి ఇద్దరికి పెళ్లి చేశారు..పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాలేదు..ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యభర్తల మధ్య అన్యోన్య జీవనం కొనసాగుతోంది..కాని అత్త మాత్రం కోడలిని సూటిపోటి మాటలు అంటోంది..మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన కొడుకును సైతం అవమానాలకు గురిచేస్తోంది...దీంతో అటు భర్తను ఎదిరించలేఖ, ఇటు అత్తతో గొడవపడలేక నాలుగు నెలల గర్భిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ బావ నీ బాధ చూడలేకే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.

వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ జిల్లా దుబ్బకు చెందిన యువతి మరియు సమీపంలోని ఖానాపూర్‌కు చెందిన సోంత మేనత్త కొడుకును ప్రేమించింది. దీంతో ఇద్దరు ఇంట్లో చెప్పడంతో ఇరువురి కుటుంబాలు వీరి వివాహనికి అంగీకరించి..గత సంవత్సరం జూన్ 16న పెళ్లి జరిపించారు...అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా..ఇటివల యువతికి,ఆమె అత్తకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి..దీంతో కోడలిని సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేసింది.అయితే అత్త మాటలు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది..దీంతో ఆమె అత్యక్రియలు సైతం నిర్వహించారు..ఇరు కుటుంబాలకు రక్త సంబంధం కావడంతో జారి పడిందని చెబుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు..దీంతో యువతి ఆత్మహత్యపై తల్లిదండ్రులు కూడ ఎలాంటీ వ్యక్తం చేయకపోవడంతోపాటు...పోలీసులకు కూడ ఎలాంటీ ఫిర్యాదులు కూడా చేయలేదు..

అయితే యువతి ఆత్మహత్య చేసుకునే ముందు ఓ లేఖ రాసింది..అందులో నా చావుకు అత్తమ్మ అంటూ పేర్కోంది.. బావ నువ్వు బాధపడకు అంటూ భర్తకు ధైర్యం చెప్పింది..భర్త బాధపడితే తాను చూడలేని చెప్పింది..అత్తకు ,తనకు మధ్య భర్త నలిగిపోవడం తాను చూడలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కోంది..చనిపోతున్నందుకు భర్తతో పాటు అమ్మా,నాన్నలకు సారీ చెబుతు తనువు చాలించింది. కాని లేఖ బయటపడినా...పోలీసులకు చేరకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
Published by:yveerash yveerash
First published: