Home /News /telangana /

DARSHANS STALLED AT STATUE OF EQUALITY UNTIL APRIL 2 DUE TO SPECIAL PUJAS WHILE CHINNA JEEYAR SKIPS CM KCR YADADRI CEREMONY MKS

KCR | Chinna Jeeyar: సమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు.. టికెట్ విషయంలో తగ్గేదేలేదు!

సమతామూర్తి సందర్శనాలు రద్దు

సమతామూర్తి సందర్శనాలు రద్దు

హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్మించిన సమతామూర్తి సందర్శనలు నాలుగురోజులపాటు రద్దయ్యాయి. ప్రత్యేక క్రతువుల కారణంగా సాధారణ భక్తులకు అనుమతి ఉండదని కేంద్రం పేర్కొంది.

హైదరాబాద్ శివారు శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని ముచ్చింతల్ లో త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్మించిన శ్రీరామనుజచార్య సమతామూర్తి సందర్శనలు రద్దయిపోయాయి. శ్రీరామనగరంలోని సమతామూర్తి కేంద్రంలో నాలుగు రోజులపాటు, అంటే, మార్చి 29(మంగళవారం) నుంచి ఏప్రిల్ 1(శుక్రవారం) దాకా సాధారణ భక్తులను సందర్శనకు అనుమతించడంలేదని సమతామూర్తి కేంద్రం ప్రకటించింది. మళ్లీ ఉగాది పండుగ (ఏప్రిల్ 2) నుంచి సమతామూర్తి సందర్శనలు యథావిథిగా కొనసాగుతాయని పేర్కొంది.

సమతామూర్తి కేంద్రంలో మార్చి 29 నుంచి మండల అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించనున్నారు. ఆ క్రతువుల్లో సాధారణ వ్యక్తులు లేదా భక్తులకు అనుమతి ఉండదు. తిరిగి ఏప్రిల్ 2 నుంచి భక్తులను సందర్శకు అనుమతిస్తామని చిన సమతామూర్తి కేంద్రం పేర్కొంది.

CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!


రామానుజ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా ప్రవేశ రుసుము చెల్లించాలనే విషయంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినా, టికెట్ విషయంలో తగ్గేదేలేదని, ప్రవేశ రుసుంలో ఎలాంటి మార్పు లేదని నిర్వాహకులు మరోసారి స్పష్టం చేశారు. ఎప్పటిలాగే ప్రతి బుధవారం సమతామూర్తి కేంద్రానికి సెలవు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, సమతామూర్తిని దర్శించుకునే భక్తులకు కేంద్రం కండిషన్లు విధించింది..

Chaitra Navratri: ఉగాది నుంచి 9 రోజులు ఈ పనులు చేస్తే నష్టపోతారు.. అనుగ్రహం పొందాలంటే..


సాధారణ వ్యక్తులు, భక్తుల సెల్‌ఫోన్‌, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్‌ పరికరాలతో సమతామూర్తి కేంద్రంలోకి అనుమతించబోమని నిర్వాహకులు పున:స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని సూచించారు. చెప్పులు, బూట్లు బయటే వదలాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదన్నారు. ఇదిలా ఉంటే,

Vastu Tips: ఇంట్లో ఈ 6 రకాల మొక్కలు ఉంటే డబ్బుతోపాటు శుభాలూ మీ సొంతం..


తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన యాదాద్రి ఆలయ పున:ప్రతిష్ట వేడుకకు చినజీయర్ స్వామి డుమ్మా కొట్టారు. నిజానికి యాదగిరిగుట్ట అని జనం పిలుచుకునే చోటుకు యాదాద్రి అని పున:నామకరణం చేసిందే చిన జీయర్ స్వామి. ఇటీవలి కాలంలో ఎక్కడా లేని విధంగా రాతి ఆలయ నిర్మాణం చేపట్టడంలో సీఎం కేసీఆర్ ను నడిపించింది కూడా ఆయనే. చినజీయర్ సారధ్యంలోనే ఆలయం పున:ప్రారంభం అవుతుందనీ సీఎం గతంలో పలుమార్లు ప్రకటనలు చేశారు. కానీ ఆ మధ్య సమతామూర్తి ఆవిష్కరణ సందర్భంలో కేసీఆర్, చినజీయర్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరి మధ్య దూరం క్రమంగా పెరుగుతూ.. పేరు పెట్టిన వ్యక్తే లేకుండా యాదాద్రి పున:ప్రారంభం అయ్యేదాకా వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.

KCR దూకుడుకు అమిత్ షా కళ్లెం! -ఢిల్లీ నుంచే మిషన్ తెలంగాణ ఆపరేషన్ -రంగంలోకి ఆ 26 మంది?


సమతామూర్తి పేరుతో 216 అడుగుల ఎత్తయిన శ్రీరామానుజ విగ్రహాన్ని నిర్మించిన చినజీయర్ స్వామి.. దాని ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లను ఆహ్వానించారు. ఇద్దరు నేతల అపాయింట్మెంట్లు ఖరారైన తర్వాతే ప్రారంభతేదీని ప్రకటించారు. కానీ రాజకీయ కారణాలతో సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో సమతామూర్తి ప్రారంభోత్సవానికి వెళ్లలేదు. సీఎం చివరి నిమిషంలో డ్రాప్ అయినా, సమతామూర్తి శిలాపలకంలో ఆయన పేరు లేకపోవడం చర్చకు దారి తీసింది. ఉద్దేశపూర్వకంగానే చినజీయర్ ఈ పని చేసి ఉంటారని, అందుకు నొచ్చుకున్నారు కాబట్టే యాదాద్రి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సింగిల్ గానే కానిచ్చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే, ఇరు పక్షాలూ ఈ వివాదాలపై నేరుగా స్పందించలేదు.
Published by:Madhu Kota
First published:

Tags: Chinna Jeeyar Swamy, CM KCR, Hyderabad, Shamshabad, Yadadri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు