హోమ్ /వార్తలు /తెలంగాణ /

Caste deportation: మంత్రి కేటీఆర్ ఇలాకాలో దళితుల సామాజిక కుల బహిష్కరణ.. వారితో మాట్లాడితే భారీ జరిమానా..

Caste deportation: మంత్రి కేటీఆర్ ఇలాకాలో దళితుల సామాజిక కుల బహిష్కరణ.. వారితో మాట్లాడితే భారీ జరిమానా..

బహిష్కరణకు గురైన గ్రామస్తులు

బహిష్కరణకు గురైన గ్రామస్తులు

Caste deportation: మంత్రి కేటీఆర్ ఇలాకాలో దళితులు సామాజిక కుల బహిష్కరణకు గురయ్యారు. సమాజంలో కులం, మతం పట్టింపులు అధికమయ్యాయి. కులానికి ప్రాముఖ్యత ఇస్తూ మనుషులను వెలివేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్‌పూర్‌లో దళితులను ఆరు నెలలుగా పెత్తందారులు సామాజిక కుల బహిష్కరణ చేశారు.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా, న్యూస్ 18 తెలుగు) 

సాంకేతిక పరిజ్ఞానం రాకెట్‌లా దూసుకపోతున్న ఈరోజుల్లో కూడా చాలామంది కులాలు, మతాల పట్టింపులు, పంతాలను వీడటం లేదు. దేశంలో ఏదో మూలన కులం పేరిట దాడులు, పరువు హత్యలు, బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ గ్రామంలో దళితులను సామాజిక కుల బహిష్కరణ చేశారు. అగ్రవర్ణాలకు చెందిన కుల పెద్దలు అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి‌పేట మండలం ఆల్మాస్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గత నాలుగు నెలలుగా సాముహిక బహిష్కరణ ఎదుర్కొంటున్న దళితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ.. గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, పాలకవర్గం చర్యలు తీసుకోకపోవడంపై దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ ఇలాకాలోనే ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలం క్రితం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆల్మాస్‌పూర్ గ్రామంలో ఓ వివాదానికి సంబంధించి దళితులకు, మరో వర్గానికి మధ్య గొడవ జరిగింది. దీంతో అవతలి వ్యక్తులు కులం పేరుతో దూషించారని దళితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

దీనిని మనసులో పెట్టుకుని గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కుల పెద్దలు తమపై సామాజిక బహిష్కరణ విధించారని దళితులు తెలిపారు. గ్రామంలోని దళితులతో ఎవరూ మాట్లాడిన, సాయం చేసిన రూ. 5 వేలు జరిమానా విధిస్తామని చాటింపు కూడా చేసినట్టు బహిష్కరణకు గురైన దళితులు తెలిపారు. వ్యవసాయ పనులకు సంబంధించి ట్రాక్టర్లు, వరి ధాన్యం కోసే యంత్రాలను కూడా పంపవద్దని అగ్రవర్ణాలకు చెందిన పెద్దలు గ్రామంలోని వారికి ఆదేశాలు ఇచ్చారని బాధితులు వాపోయారు. ఈ విషయాన్ని సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల నుండి అగ్రవర్ణాల పెద్దలు ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఈ విషయమై తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. నాలుగు నెలలు గడుస్తున్న సామాజిక కుల బహిష్కరణకు వ్యతిరేకంగా చర్యలు కరువైన నేపథ్యంలో.. గ్రామానికి చెందిన దళిత(ఎస్సీ మాల, మాదిగ) వార్డు మెంబర్లు రాజీనామా చేశారు. వారి రాజీనామా లేఖలను అధికారులకు సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారనే.. తమను సామాజిక బహిష్కరణకు గురిచేశారని రాజీనామా చేసిన దళిత వార్డు మెంబర్లు ప్రమోద్. ప్రేమలత, శంకర్‌లు తెలిపారు.


ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు మరియు రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆరు నెలల నుంచి తమ గ్రామంలో దళితులను సామాజిక కులబహిష్కరణ చేసి బీసీ, ఓసీలు మానసికంగా వేధింపులకు గురిచేస్తు న్నారన్నారు. ఇంత జరుగుతున్నా గ్రామానికి, మండ లానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమ న్నారు. ఆరు నెలల కిందట దళితులపై దాడి చేసి కొట్టి, కులం, జాతి పేరుతో దూషించగా.. బాధితు లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పారు. దీంతో దళి తులపై అన్ని సామాజిక తరగతుల వారు కక్షగ ట్టారని తెలిపారు. అందులో భాగంగానే దళితులను కూలి పనులకు పిలువడం లేదన్నారు. అంతేకా కుండా వ్యవసాయ పనులకు పిలువకపో వడం, దళితుల వ్యవసాయ పొలాలకు వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు పంపడం లేదన్నారు.

First published:

Tags: Caste deportation, Crime news, Karimnagar, Sircilla

ఉత్తమ కథలు