Home /News /telangana /

DALITHA BANDHU BENEFICIARIES GET EXTRA AMOUNT IN THE FORM OF INTEREST IN THEIR BANK SPECIAL ACCOUNTS SK

Dalitha Bandhu: దళిత బంధు లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదనంగా మరికొంత డబ్బు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dalitha Bandhu Scheme: దళిత బంధు నిధులను మూడు నెలల క్రితమే జమచేసినందున.. ఒక్కో లబ్ధిదారుడికి ఇప్పటికే కనీసం రూ.8-9వేల వరకు వడ్డీరూపంలో అందుతాయని తెలుస్తోంది. లబ్ధి దారులకు యూనిట్లు మంజూరయ్యే వరకు వారి ఖాతాల్లో డబ్బు జమవుతూనే ఉంటుంది.

ఇంకా చదవండి ...
    దళిత బంధు పథక (Dalitha Bandhu Scheme) లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ.10 లక్షలతో పాటు అదనంగా మరికొంత డబ్బు అందనుంది. వారికి యూనిట్లు మంజూరయ్యే వరకు ప్రత్యేక ఖాతాల్లోని డబ్బుపై వడ్డీ జమ కానుంది. లబ్ధిదారుల పేరిటే ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించనున్నాయి. దళిత బంధు నిధులను మూడు నెలల క్రితమే జమచేసినందున.. ఒక్కో లబ్ధిదారుడికి ఇప్పటికే కనీసం రూ.8-9వేల వరకు వడ్డీరూపంలో అందుతాయని తెలుస్తోంది. లబ్ధి దారులకు యూనిట్లు మంజూరయ్యే వరకు వారి ఖాతాల్లో డబ్బు జమవుతూనే ఉంటుంది. ఈ లెక్కన దళిత బంధు కింద వచ్చే 10 లక్షలతో పాటు అదనంగా మరో రూ.15వేల వరకు అందవచ్చని సమాచారం.

    Telangana Crime: గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు.. ఒక్కరోజే 12 మంది మృతి.. అతివేగమే కారణమా..?

    దళిత సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో మొదట దళిత బంధు పథకం ప్రారంభమైంది. హుజురాబాద్ ఉపఎన్నికలకు ముందు అక్కడ సీఎం కేసీఆర్ లాంచనంగా పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 20 వేల మంది వరకు లబ్ధిదారులు ఉంటారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. వీరిలో ఇప్పటికే 18 వేల మందికి రూ.10 లక్షల చొప్పున రూ.1800 కోట్లు జమ చేసింది. ఇక సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేసింది. ఐతే ఇప్పటికే 66 ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేశారు. బ్యాంకుల్లో లబ్ధిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలు తెరిచి ఈ నిధులను జమచేసింది.

    Hyderabad weather : నగరంలో చలి పులి.. రికార్డు స్థాయిలో చలి తీవ్రత..

    లబ్ధి దారుల పేరిట బ్యాంక్ ఖాతాలను తెరిచి, అందులో డబ్బులు వేసినప్పటికీ వాటిని లబ్ధిదారులు విత్ డ్రా చేసుకునేందుకు వీల్లేదు. ఆ డబ్బుతో ఏం చేస్తారో.. ఎలాంటి వ్యాపారం చేస్తారో ముందు డిసైడ్ అవ్వాలి. యూనిట్లు ఎంపిక చేసుకుని, కలెక్టర్ల ఆధ్వర్యంలో అనుమతి పొందేవరకు లబ్ధిదారులు ఖాతాల నుంచి నేరుగా నిధులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. ఇప్పటి వరకు 60 మంది లబ్ధిదారులు మాత్రమే దళిత బంధు పథకం కింద ట్రాక్టర్లు, కార్ల యూనిట్లు తీసుకుని వ్యాపారాలు ప్రారంభించారు. వాటితో స్వయం ఉపాధి పొందుతున్నారు. మిగతా లబ్ధిదారులకు విభిన్న యూనిట్లపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారికి యూనిట్లు మంజూరయ్యే వరకు ఆయా ఖాతాల్లో నిధులపై బ్యాంకులు సాధారణ వడ్డీ జమ చేస్తాయి. ఆ డబ్బులను కూడా లబ్ధిదారులకే ఇస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Dalitha Bandhu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు