Home /News /telangana /

DALITA BHANDU BENIFICIARIES LIST IS BEING SELECTED FROM TODAY VRY

Dalita Bhandu : దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక.. షురు అయిన ప్రక్రియ

అబ్ధిదారులతో మంత్రి గంగుల

అబ్ధిదారులతో మంత్రి గంగుల

Dalita Bhandu : దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుండి ఊపందుకుంది. లబ్దిదారుల ఎంపికతో పాటు యూనిట్లను సైతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు..

  ( కరీంనగర్ జిల్లా..న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

  మార్చి 31 ,వరకు దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికారుల్లో కదలిక మొదలైంది . శని వారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆదేశించగా , సోమవారం నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నారు . రాష్ట్రం లోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారు . ఇప్పటికే వాసాలమర్రి గ్రామంతోపాటు హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ పథకాన్ని నూరు శాతం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు . హుజూరాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించారు .

  యూనిట్ల ఎంపిక కొనసాగుతుంది .

  నాలుగు జిల్లాల పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా , హుజూరాబాద్లో ఇప్పటికే ప్రారంభమైంది. కనుక 11 నియోజవర్గా లలో స్థానిక ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఆమోదింప చేయాల్సి ఉంటుంది . ప్రతి లబ్దిదారుడికి ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా రూ .10 లక్షలను ఈ పథ కం కింద ఇవ్వనున్నారు . లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయడం తోపాటు ఒక్కో లబ్ధిదారుడికి మంజూ రైన రూ .10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణ నిధ కి జమ చేస్తారు . హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన 17 , 556 కుటుంబాల ఖాతాల్లో దళిత బంధు  నగదు ఇప్పటివరకు జమచేశారు . 1500 లకు పైగా కుటుంబాలు డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకోగా వారికి శిక్షణ ఇప్పించి యూనిట్లను మంజూరు చేయించారు . డెయిరీ షెడ్ల నిర్మాణం కోసం రూ.లు 1.50 లక్షలు అందించారు . ఈ నియోజకవర్గం నుంచి 6,800 మంది ట్రాన్స్‌పోర్టు వాహనాల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన వారికి లైసెన్సులు ఇప్పించారు .

  Hyderabad : పెళ్లి కావడం లేదని పురోహితుడి వద్దకు వెళితే.. తానే పెళ్లి చేసుకుంటానని..

  దళిత బంధు పథకంలో లాభసాటిగా ఉండే డెయిరీ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మిగతా యూనిట్లకు లబ్ధిదారుల కు అవగాహన కల్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నారు . కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ , మానకొండూర్ , చొప్పదండి , జగిత్యాల జిల్లాలోని జగిత్యాల , కోరుట్ల , ధర్మపురి , పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి , రామగుండం , మంథని , రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల , వేములవాడ నియోజకవర్గాల్లో మొదటి దశలో మార్చి 31 వ తేదీలోగా వంద యూనిట్ల చొప్పున దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు . వచ్చే నెల ఫిబ్రవరి 15 వ తేదీలోగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు , అధికారుల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి 31 లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు .

  Mahbubnagar: వివాహితుడిని ప్రేమించిన 15 ఏళ్ల బాలిక.. పెద్దలు అంగీకరించకపోవడంతో చివరికి..

  దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచు కున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా డెయిరీ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారు . ఇప్పటి వరకు 1500 మందికి పైగా లబ్ధిదారులు మందుకు రావడం విశేషం . సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్న ముగ్గురు లబ్ధిదారులకు హర్యానా నుంచి పాడి గేదెలు తెచ్చుకొని యూనిట్లు ప్రారంభించిన అనంతరం మరింత మంది యూనిట్ల నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు . ఆగస్టు 16 న హుజురాబాద్లో దళిత బంధును ప్రారంభించిన అనంతరం 27 ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కరీంనగర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు ప్రకటించగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు .

  ఇందుకు తగ్గట్టుగానే డెయిరీ ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించడంతో డెయిరీపై మక్కువ పెరిగింది . డెయిరీ తరువాత ఎక్కువగా హార్వేస్టర్లు , ట్రాక్టర్లు , వ్యవ సాయ పనిముట్లపై మక్కువ చూపుతు న్నారు. దీనితో మరో మరు దళిత కుటుంబలలో ఆనందం వ్యక్తం అవుతుంది.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Dalitha Bandhu, Karimangar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు