Huzurabad by election : "హుజూరాబాద్ ఈటల రాజేందర్ దళిత బంధు".. అని పేరు పెడితేనే సార్థకం

కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్

Huzurabad by election : దళిత బంధు పథకంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ రాజీనామా వల్ల దళిత బంధుకు ఆయన పేరును పెట్టాలని అన్నారు. పథకానికి ఈటల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధుగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad by election ) చివరి రోజున బీజేపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ( Eetala Rajender ) నామినేషన్ వేశారు. ఆయన వెంటన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ( kishan reddy ) పాటు ఇతర పార్టీ నేతలు పాల్గోన్నారు. నామినేషన్ పూర్తయిన తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే దళిత బంధుపై ( Dalita Bandhu ) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లే సీఎం కేసిఆర్ ( cm kcr ) దాన్ని ప్రవేశపెట్టారని అందుకే ఆ పథకానికి ఈటల రాజేందర్ హుజూరాబాద్ అని పేరు పెడితేనే దానికి అర్థం ఉంటుందని అన్నారు. ఇక ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    కాగా సీఎం కేసీఆర్‌కు ఆత్మాభిమానంతో పాటు ప్రశ్నించేవారు ఉండకూడదనే ఆలోచనలో ఉంటారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ఇన్నాళ్లు హుజూరాబాద్ ప్రజలకు సేవ చేసిన ఈటల రాజేందర్‌నే గెలిపిస్తారని చెప్పారు. ఈటెల రాజీనామాతో కెసిఆర్ కుటుంబం పీఠాలు కదులుతున్నాయని అన్నారు..కల్వకుంట్ల పాలనకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రజలకు హుజూరాబాద్ ప్రజలు దారి చూపిస్తున్నారని చెప్పారు. దుబ్బాక, హైదరాబద్‌లలో తెరాసా కి ఎలా బుద్ది చెప్పారో చూశామని,,ఇప్పుడు కూడాఆశీర్వదించి కడుపులో పెట్టుకొని గెలిపించాలని తెలంగాణలో ఉన్న ప్రతి రైతు, యువకుడు, ప్రజలు ఆశిస్తున్నారన్నారు... ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టినా, కేసులు పెట్టినా అడ్డదారులు తొక్కిన ప్రజా నిర్ణయం ముందు నిలబడలేరని అన్నారు. .

    ఇది చదవండి : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో మంతనాలు..?


    7 సంవత్సరాల నుండి ఎన్నిక వచ్చినప్పుడల్లా.. ఇచ్చిన హామీ మళ్లీ ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నిక అవ్వగానే మోసం చేయడం కెసిఆర్ నైజమని ఆరోపించారు...సీఎం కేసీఆర్ నిర్ణయాలతో..
    తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని, అహంకారంతో బరితెగించిన పాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంకు అన్నీ విధాలుగా సాయం అందిస్తుంటే.. కెసిఆర్ మాత్రం వాటిని విడుదల చేయడం లేదని అన్నారు.

    ఇది చదవండి : డబుల్ ఇళ్లపై సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన .. సొంత స్థలాలకు కూడా..

    Published by:yveerash yveerash
    First published: