Dalita Bandhu: దళితులపై ఆ ప్రచారం నిజంకాదు.. అందులోనూ రిజర్వేషన్లు కల్పిస్తామన్న సీఎం కేసీఆర్

దళితబంధుపై సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్

Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకుని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 • Share this:
  దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృధ్ది చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేననని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అంబేద్కర్ తీసుకువచ్చి అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పేమి జరగలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి, తర తరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్ష ను బద్దలు కొట్టాలనే అత్యున్నత ఆశయం తో, సామాజిక బాధ్యత తో నిర్దిష్టమైన లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలు లోకి తెచ్చామని పునరుద్ఘాటించారు.

  ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌షిప్‌లు, ట్రాన్స్ పోర్టు పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బారు, వైన్ షాపులు తదితర రంగాలద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

  దళితబంధు పథకాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వాసాలమర్రి, హుజూరాబాద్ లలో ప్రకటించిన విధంగా నిధులను విడుదల చేసామన్నారు. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధుకు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని తెలిపారు. దళిత ఎంపవర్ మెంట్ కింద 1000 కోట్ల రూపాయలను కూడా తానే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించానని అన్నారు. ఇదేదో రోటిన్ వ్యవహారం కాదు.. గతంలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని కార్యక్రమం ఇది అని వెల్లడించారు.

  EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

  Money Transfer to Wrong Account: పొరపాటుగా వేరే అకౌంట్‌కు వెళ్లిన డబ్బును తిరిగి పొందవచ్చా ?.. అందుకు ఏం చేయాలి ?

  రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకుని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో అనేక రంగాల్లో దేశం గర్వించదగ్గ అభివృద్ది సంక్షేమం సాధించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే ఉద్యమ స్పూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఎదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదని దశలవారీగా విజయాన్ని చేరుకుంటామన్నారు. దశలవారిగా రాష్ట్ర వ్య్మాప్తంగా బడ్జెట్ లోనిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తామన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: