DALITA BANDHU FUNDS RELEASED TO FOUR NEW MANDALS VRY
Dalita Bandhu : మరో నాలుగు మండలాలకు దళిత బంధు.. నిధులు విడుదల
సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)
Dalita Bandhu : ముఖ్యమంత్రి కేసిఆర్ హామి మేరకు మరో నాలుగు మండలాలకు దళిత బంధు నిధులు విడుదల అయ్యాయి. ఎంపిక చేసిన ఆయా మండలాలకు తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు విడుదల చేసింది.
దళితబంధు పథకం అమలులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలో ప్రకటించినట్టుగా నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. దళిత బంధు నిధులు విడుదలైన వాటిలో
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గాను 50 కోట్ల రూపాయలు,ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి 100 కోట్ల రూపాయలు . నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి... 50 కోట్లు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలానికి 50 కోట్ల రూపాయలను ...విడుదల చేశారు. కాగా నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ మంగళవారం జమచేసింది.
కాగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధును తీసుకువచ్చిన సీఎం కేసిఆర్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పూర్తి స్థాయిలో దళిత బంధును అమలు పరుస్తామని సీఎం ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీంను అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో గత రెండు రోజుల క్రితమే పథకం అమలుపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి దళిత బంధు నిధులపై సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.