DALIT FAMILIES WERE BOYCOTTED IN THE VILLAGE WHICH IS CM KCR DATTATA VILLAGE VRY NZB
Nizamabad : సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దళిత కుటుంబాలను వెలి.. కారణం ఇదేనంటున్న వీడిసీలు..
మోతే గ్రామంలో దళితుల బహిష్కరణ
Nizamabad : విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధికారంతో మరో గ్రామంలో చిచ్చు రేగింది. ఇరు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించాలన కమిటి పెద్దలు ఒక వర్గానికి కొమ్ము కాస్తుండడంతో వివాదం ముదురుతోంది.అయితే అది కూడా సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో కావడం విశేషం..
నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్రతినిది పి మహేందర్
రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం ఎర్పడిన గ్రామ అభివృద్ది కమిటిలు(vdc) కొన్ని గ్రామాల్లో తమ అధికారంతో కొన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. తాము చెప్పిందే వేదంగా గ్రామంలో రాజకీయ(politics) కక్ష్యలతో పాటు సామాజిక విభేదాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు గ్రామ అభివృద్ది కమిటీ తీరు వివాదస్పదం అవుతోంది. వారు చెప్పిందే వేదంగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ గ్రామానికి చెందిన కుటుంబాలను సామాజికంగా బహిష్కరిస్తున్న(boycott) సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఈ క్రమంలోనే నిజామాబాద్ రూరల్ (nizamabad)జిల్లాలోని ఆర్మూర్, వేల్పూర్, మరియు ఇతర గ్రామాల్లోని పలు కమిటిల ఆగడాలు మితిమీరినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మోతే గ్రామంలో సుమారు 200 కుటుంబాలను ఓ వివాదంలో బహిష్కరించారు. వారికి వివిధ పనుల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దళిత కుటుంబాలకు చెందిన గ్రామస్థుడు చనిపోతే... అత్యక్రియలకు కావాల్సిన వస్తువులు ఇచ్చేందుకు ఆ గ్రామస్థులు నిరాకరించారు. దీంతో విషయాన్ని జిల్లా కలెక్టర్కు కూడా పిర్యాదు చేసేవరకు వెళ్లింది.
వివాదంలోకి వెళితే.. గ్రామానికి చెందిన భూమిలో చాకలి కులస్థుల కోసం ధోబీఘాటులు నిర్మించేందుకు గ్రామ కమిటి నిర్ణయించింది. అయితే ఆ భూమి గత ఇరవై సంవత్సరాల క్రితం మొత్తం గ్రామానికి చెందిన వారు మొత్తం 26 ఎకరాలు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.దీంతో.. దోభిఘాట్ నిర్మించిన తర్వాత స్థానికంగా ఉండే దళిత కుటుంబాల బట్టలు కూడా ఉతకాలని గ్రామంలోని దళితులు కండిషన్ పెట్టారు. అప్పుడే వారికి దోభిఘాట్లు నిర్మించి ఇచ్చేందుకు అంగీకరిస్తామని చెప్పారు.
అయితే ఇందుకోసం బట్టలు ఉతికే చాకలి వారు ముందుకు రాలేదు.. తాము రెగ్యులర్గా ఉతికే వారి మాత్రమే ఉతికేందుకు అంగికరించారు. అంతే దళిత కుటుంబాల(Dalit family) బట్టలు ఉతకడం వల్ల తమకు సామాజికంగా, కుటుంబపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. మాల మాదిగల బట్టలు ఉతకడం తమ వృత్తి కాదని అందుకోసం తమ కులదైవం కూడా ఒప్పుకోదని వారు తెగేసి చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని దళితులు గ్రామంలో దోభిఘాట్లు నిర్మించేందుకు నిరాకరించారు.
ఈ విషయంలో ఎంటర్ అయిన గ్రామ అభివృద్ది కమిటీ దళితులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. చాకలి కులానికి చెందిన వారికి మద్దతు పలికారు. వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దోభిలు చెప్పినట్టుగా వారిక సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే దళిత కుటుంబాలకు ఎవరు సహకరించ కూడదని హుకుం జారీ చేశారు. గ్రామ పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగ ఉన్న దళిత కుటుంబాలపై వేటు వేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే దళిత కుటుంబాలు జిల్లా కలెక్టర్(collector) తోపాటు ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఓ వైపు దళిత సాధికారిత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా... గ్రామాల్లో మాత్రం సామాజిక వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. దీంతో పలు కులాల మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు కులాలు వారికి సహకరించేందుకు ముందుకు రావడం లేదు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.